Hyderabad

News July 7, 2024

HYD: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రత్యేక బస్సులు

image

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ RTC శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న 18 డిపోల నుంచి 80 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, JBS, MGBS, CBS, ECIL క్రాస్ రోడ్స్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయన్నారు.

News July 7, 2024

HYD: పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా GHMC

image

గ్రేటర్ HYD నగరంలో వివిధ పన్నులకు సంబంధించి పూర్తి డిజిటలైజేషన్ దిశగా GHMC అడుగులు వేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపునకు నగదును స్వీకరించమని గతంలోనే కమిషనర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిబంధన అమల్లోకి వచ్చాయి. యూపీఐ, క్యూఆర్ కోడ్, క్రెడిట్ ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేయాల్సి ఉంది. దీని ద్వారా అక్రమ వసూళ్లకు తెరపడనుంది.

News July 7, 2024

HYD: జులై 8 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ!

image

HYD ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కోటా కింద జులై 8 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్, tuskercrc-202@gov.in, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

News July 7, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్లకు యాప్ ద్వారా CHECK

image

HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్‌స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్‌లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్‌లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News July 7, 2024

HYD: రూట్లతో 132 ఎకరాల్లో HMDA లేఅవుట్!

image

HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్‌కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.

News July 6, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

హైదరాబాద్‌ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్‌పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఆర్టీసీ బస్సులో డెలివరీ.. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన GHMC

image

HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్‌‌‌‌‌ను‌ జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి‌ స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.

News July 6, 2024

HYD: ‘గంజాయి కేసుతో ఉస్మానియాకు సంబంధం లేదు’

image

గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడిన మెడికోలకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.  గంజాయి కేసులో పట్టుబడిన డాక్టర్ మణికందన్, డాక్టర్ అరవింద్ గతంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివిన వారు మాత్రమేనని అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని పేర్కొన్నారు.

News July 6, 2024

HYD: రేపటి నుంచి బోనాలు.. గుడిలో అధ్వాన పరిస్థితి! 

image

ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌ బస్తీలో‌ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అమ్మవారి ఆలయ ప్రహరీ కూలిపోయింది. వరదలకు నిర్మాణంలో ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని‌ స్థానికులు వాపోతున్నారు. రేపటి నుంచి నగరంలో బోనాలు మొదలుకానున్నాయి. ఇలా అయితే పండుగ ఎలా జరుపుకోవాలని బస్తీ వాసులు నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 6, 2024

HYD: మంత్రిని కలిసిన BRS ఎమ్మెల్యేలు

image

గ్రేటర్ HYD, మేడ్చల్ జిల్లా పరిధి BRS ఎమ్మెల్యేలు‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు‌ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద, ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA కృష్ణారావు, శేరిలింగంపల్లి MLA అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.