India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం పురస్కరించుకొని బుధవారం 30,546 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,85,134 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.90,080 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,820, అన్నదానం రూ.35,234,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
వేములవాడ నిత్య అన్నదాన సత్రానికి రూపాయలు రూ.35 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తన చిరకాల స్వప్నం నిత్యాన్నదానం సత్రం నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు.
సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.236 కోట్లతో మానేరు రిజర్వాయర్భూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం, రూ.కోటి 45 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొనడానికి వేములవాడకు మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. పగటిపూట సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువ అవుతాయని నిపుణులు సూచించారు. చలి తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈనెల 20న సిరిసిల్ల జిల్లాలో జరిగే సీఎం పర్యటనకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బాధ్యత ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులతో కలిసి మంగళవారం రివ్యూ నిర్వహించారు. సీఎం మొదటగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.
కార్తీక మాసం సందర్భంగా KNR మండలం నగునూర్లోని శ్రీదుర్గాభవాని ఆలయంలో ఈనెల 23న సాయంత్రం కార్తీకమాస లక్ష దీపకాంతుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మన్ తెలిపారు. ఈనెల 23న ఉదయం సామూహిక సత్యనారాయణ వ్రతం, తులసీ కళ్యాణం, సాయంత్రం అమ్మవారికి కార్తీక మాస ప్రయోక్త చతుషష్టి పూజలు, దీపాసంకల్పం, దీపారాధన, మహా మంగళ హారతి అనంతరం లక్షదీపోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు.
మంథని పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో మంథని మున్సిపాలిటీపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి రివ్యూ నిర్వహించారు. మంథని పట్టణంలో ఉన్న మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య విధులను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
@ పెద్దపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రంలో కొండచిలువ ప్రత్యక్షం.
@ ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెండ్.
@ మల్లాపూర్ మండలంలో మాడల్ స్కూల్ను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి.
@ రేపు వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
@ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
Sorry, no posts matched your criteria.