India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ పాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, బిసి విద్యార్థి సంఘ నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు కమలాకర్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలోనే కొనసాగుతాయని చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట, మానకొండూర్ మండలాల్లో 41.4°C నమోదు కాగా, ఇల్లందకుంట, గన్నేరువరం 41.2, తిమ్మాపూర్ 41.1, కరీంనగర్ రూరల్ 41.0, చిగురుమామిడి 40.9, కరీంనగర్ 40.4, గంగాధర, వీణవంక, కొత్తపల్లి 40.3, రామడుగు 39.9, శంకరపట్నం 39.8, సైదాపూర్ 39.7, హుజూరాబాద్ 39.5, చొప్పదండి 38.4°C గా నమోదైంది.
కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతూ సంధ్య అనే గర్భిణి మృతి చెందినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య తీవ్ర రక్తస్రావంతో అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. కాగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు మృతురాలి భర్త జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించుటకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు క్రీడా శాఖ తెలిపారు. జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను జిల్లా వ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ లోపు అంబేద్కర్ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
శంకరపట్నం(M) తాడికల్ గ్రామశివారులో KNR-WGL ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సైదాపూర్ మండలం గర్రెపల్లికి చెందిన కౌడగాని కిషన్ రావు, భార్య శోభ, కూతురు అశ్విని బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శోభ చికిత్స పొందుతూ మృతి చెందింది. శోభ తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు SI రవి తెలిపారు.
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల ప్రవేశాల దరఖాస్తు నెల 30 వరకు పొడిగించారు. అర్హత గల విద్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి డి. పవన్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యలయంలో, 0878 2957085 ఫోన్‌లో సంప్రదించాలన్నారు.
కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రపుల్ దేశాయ్ అధ్యక్షతన సెర్ప్ సిబ్బంది (DPMs/APMs/CCs & VOAs) తో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐ.కె.పి ద్వారా చేపట్టబోయే (138) PPC లలో పారదర్శకంగా తూకం వేయాలని ఆదేశించారు. తేమ శాతాన్ని సరైన విధంగా చూస్తూ, తాలు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలుకు సంబంధించిన రికార్డ్‌ను డాటా ఎంట్రీని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.