India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను మిషన్ మోడ్‌లో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రత్యేక అంశాలతో (థీమ్స్) ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

<<19312594>>బైక్‌ను టిప్పర్<<>> ఢీకొన్న ఘటనలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ మృతి చెందారు. శుక్రవారం ఈ ఇద్దరు మిత్రులు బైక్‌పై వెళుతుండగా చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల తలలు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. రామడుగుకు చెందిన ఈరెల్లి గౌరమ్మ (65) తన పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్లలో ఉండగా, హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకం వెనుక తెలిసిన వారే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు శుక్రవారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కీలక సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రగతి ప్రణాళిక అమలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు.

కరీంనగర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా కోరుతూ కరీంనగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్టోస్టీన్ వ్యవహారంలో వచ్చిన అంశాలపై మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే KNR కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో 99 రోజుల పాటు జిల్లాలోని 16 మండలాల్లో ఈ వాహనం పర్యటించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు ఇంటిపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని అన్నారు.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ పండుగ సందర్భంగా మహిళా విద్యార్థులతో సహజ రంగులతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ హిత దృక్పథంతో, ఆరోగ్య రక్షణను ప్రధానంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకలో రసాయనిక రంగులను పూర్తిగా నివారించి సహజ పూలు, ఔషధ గుణాలున్న వనరులతో రంగులను తయారు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్టు ప్రాంగణం రంగులతో కళకళలాడింది.

హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.

రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని KNR జిల్లా ప్రజలకు సీపీ గౌష్ ఆలం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సౌహార్దానికి, సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో చట్టబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో పలు సూచనలు జారీ చేశారు. చర్మం, కళ్లకు హాని చేసే రసాయనిక రంగులను కాకుండా, సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.