Karimnagar

News March 15, 2026

KNR: ‘స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

image

స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డా.బీఎన్.రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది తప్ప ఉత్తమ ఉద్యోగ పాలసీని తయారు చేయలేక పోతున్నారని విమర్శించారు.

News March 15, 2026

కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

image

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

KNR: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. వినూత్న శిక్ష

image

కరీంనగర్‌లో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన మంకమ్మతోటకు చెందిన టి.శేఖర్‌కు కోర్టు వినూత్న శిక్ష విధించింది. రూ.6 వేల జరిమానా చెల్లించకపోవడంతో, రెండో తరగతి ప్రత్యేక మేజిస్ట్రేట్ డాక్టర్‌ ఈదుల లక్ష్మి ఈ తీర్పునిచ్చారు. దీని ప్రకారం నిందితుడు మార్చి 13 నుంచి ఏడు రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

News March 13, 2026

KNR: అల్లరి మూకల అదుపుపై పోలీసులకు శిక్షణ

image

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఆర్, క్యూఆర్‌టీ బలగాలకు ‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’ నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో సిబ్బందికి లాఠీఛార్జ్, స్మోక్ గన్, ‘వజ్ర’ వాహన వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అల్లరి మూకలను వ్యూహాత్మకంగా అదుపు చేస్తూనే, స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News March 13, 2026

కరీంనగర్ పీటీసీలో ఘనంగా దీక్షాంత పరేడ్

image

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో 99 మంది నూతన కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్ ఘనంగా జరిగింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుంచి సీపీ గౌష్ ఆలం గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ చాటిన వారికి అవార్డులు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు.

News March 13, 2026

KNR: ‘కొత్త కలెక్టరేట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి’

image

కరీంనగర్ జిల్లా కొత్త కలెక్టరేట్‌ పనులను సత్వరమే పూర్తి చేసి, భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె.. ప్రధాన గేటు, విద్యుత్‌, పైపులైను వంటి పెండింగ్‌ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రారంభానికి సిద్ధం చేసేలా పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.

News March 13, 2026

కరీంనగర్ జిల్లాలో గ్యాస్‌ కొరత లేదు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సరఫరా యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆమె, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9154249727ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News March 13, 2026

కరీంనగర్ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

image

కరీంనగర్‌లోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో 2025–2026 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి TGSP కానిస్టేబుల్ గోగికర్ రోహన్ ‘ఆల్ రౌండర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై రోహన్‌కు ట్రోఫీని అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.

News March 12, 2026

KNR: ఆర్ఎంపీ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ

image

తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకొని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News March 12, 2026

కరీంనగర్‌ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

image

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలన్నారు. సింగిల్‌ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్‌ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.