India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇటీవల అకాల మరణం చెందిన ఎస్సై చంద్రశేఖర్ స్మారకార్థం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం సంతాప సభ నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. చంద్రశేఖర్ సేవలను గుర్తుచేసుకున్న సీపీ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ గౌష్ ఆలం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో రాజీలేని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించాలని, మాదకద్రవ్యాలు, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా సక్రమంగా జరుగుతోందని స్పష్టం చేశారు. భయంతో ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంధనం లభ్యత విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని సీపీ సూచించారు.

ఓటరు జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకత పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపుపై అపోహలు వద్దన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకుని ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. సీతారాంపూర్‌లోని భారత్ గ్యాస్ గోదామును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాటిచెట్టుపై నుంచి కిందపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల వేణు ఉదయం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడడంతో వెన్నుపూసతో పాటు, పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 233 అర్జీలను స్వీకరించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మాజీ సర్పంచులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.