Karimnagar

News March 23, 2026

కరీంనగర్: ప్రజావాణిలో మాజీ సర్పంచ్‌ల వినతి

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మాజీ సర్పంచులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 22, 2026

కరీంనగర్: ‘హృదయవిదారక చిత్రం’

image

శంకరపట్నం మండలం అంబేడ్క‌ర్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన మూడేళ్ల చిన్నారి నిత్య దహన సంస్కారాలు ఆదివారం నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చేతుల మీదుగా పాప మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లడం అందరినీ కలచివేసింది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు జరగగా, తల్లిదండ్రుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

News March 21, 2026

KNR: లగ్జరీ బస్సులో వాటర్ బాటిల్ బంద్

image

ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, డిలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్న జీవ (500 ML) వాటర్ బాటిళ్ల సరఫరా బంద్ చేశారు. కానీ వాటర్ బాటిల్‌కు టికెట్ ఛార్జీలో రూ.10 ఛార్జి వడ్డించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉన్నతాధికారులు స్పదించి కరీంనగర్ రీజియన్ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్ సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News March 20, 2026

కరీంనగర్: సింధీలకు ‘ఝూలేలాల్’ స్ఫూర్తి: కేంద్ర మంత్రి

image

సింధీలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన సింధీల నూతన సంవత్సర వేడుకలు (చేటీ చంద్)లో ఆయన పాల్గొని సందడి చేశారు. విభజన కష్టాలను అధిగమించి, ఆరాధ్య దైవం ఝూలేలాల్ జీ బాటలో సింధీ సమాజం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. అద్వానీ, అదానీ వంటి ప్రముఖులు ఈ వర్గం వారేనని ఆయన గుర్తు చేశారు.

News March 20, 2026

కరీంగర్: బడ్జెట్ అంకెల గారడీ, ప్రజలకు దగా: కేంద్ర మంత్రి

image

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా వంచించిందని ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలకు పాడె కట్టిన ఈ బడ్జెట్, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా ఉందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను విస్మరించి, మైనారిటీలకు అధిక నిధులు కేటాయించడం విడ్డూరమన్నారు.

News March 17, 2026

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.