Karimnagar

News February 26, 2026

కరీంనగర్ నూతన కొత్త కలెక్టర్‌ చిత్ర మిశ్రా ప్రొఫైల్

image

కరీంనగర్ జిల్లా పాలనా పగ్గాలను 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా చేపట్టారు. సంగారెడ్డికి చెందిన ఆమె, నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో విశేష కృషి చేశారు. యువ అధికారిణి రాకతో కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో సరికొత్త వేగం పుంజుకోనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

News February 26, 2026

కరీంనగర్ బస్టాండ్‌లో లగేజీ బ్యాగు లభ్యం

image

కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్‌కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332 నంబర్లలో సంప్రదించి, ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని అవుట్‌పోస్ట్ పోలీసులు కోరారు.

News February 26, 2026

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 25, 2026

KNR: ‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

image

అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం – 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లోకల్ కమిటీ మెంబర్ రాజా రెడ్డి ఈ చట్టంపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం ఈ చట్టం ఎంత ముఖ్యమో వివరించారు.

News February 25, 2026

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో నగరంలోని పలు కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, ప్రతి కేంద్రం వద్ద స్టాటిక్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 25, 2026

KNR: నూతన రిసెప్షన్ కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ

image

ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్‌ను సీపీ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు, చలాన్లపై ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని, సలహాలు కూడా ఇవ్వవచ్చని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News February 25, 2026

KNR: లక్ష్యానికి చేరువలో రుణాల పంపిణీ: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.11,358.47 కోట్ల రుణాలు అందించి, 84.55% లక్ష్యాన్ని సాధించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి రూ.4,665 కోట్లు, MSMEలకు రూ.2,329 కోట్లు మంజూరు చేశామన్నారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, నిరుపయోగంగా ఉన్న డిపాజిట్లపై ‘ఉద్గమ్’ పోర్టల్ ద్వారా ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News February 25, 2026

కరీంనగర్: 400 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 15,389 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 14,989 మంది మాత్రమే పరీక్ష రాశారని జిల్లా విద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, గైర్హాజరు మినహా పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని తెలిపారు.

News February 25, 2026

కరీంనగర్: పారదర్శకంగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం ప్రారంభమైన మొదటి సంవత్సరం పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నిఘా, వసతులను పరిశీలించి, మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News February 25, 2026

KNR: ‘విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలి’

image

వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించి, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు.