India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కల్లుగీత కార్మికుల ప్రాణ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. గీత కార్మికులు చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టు జారకుండా ప్రత్యేక పరికరాలను అందజేస్తోంది. కాటమయ్య రక్షణ కవచం పేరిట ఆరు రకాల పరికరాల కిట్టును పంపిణీ చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఉచిత శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అవి పూర్తి కాగానే రక్షణ కవచాలను గీత కార్మికులకు ఉచితంగా అందజేయనుంది.
కరీంనగర్ జిల్లా కేశవపట్నం వారసంతలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సంతలో పండ్లు అమ్ముకునే వ్యక్తి పక్కనే పూలు అమ్ముకునే మహిళపై అసభ్యంగా తిడుతూ చెప్పుతో దాడి చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేసి మహిళను అక్కడినుంచి పంపించారు. అయితే కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టి దెబ్బలు తిన్న మహిళనే అక్కడినుంచి పంపేయడంతో పోలీసులు ఆ వ్యక్తికే వత్తాసు పలకడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తొమ్మది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సహా.. పలు ప్రాంతాల్లో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇక్కడి ఇంటి బిడ్డలు, కోడళ్లు.. 7, 9 రోజులకు రెండు సార్లూ సద్దుల బతుకమ్మలో పాల్గొంటారు. మరి మీ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడో కామెంట్ చేయండి.
@ శంకరపట్నం మండలంలో ఎస్సారెస్పీ కాలువలో పడి రైతు మృతి.
@ బెజ్జంకి మండలంలో మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య.
@ సిరిసిల్ల ప్రజావాణిలో 82 ఫిర్యాదులు.
@ జగిత్యాల ప్రజావాణిలో 25 ఫిర్యాదులు.
@ హుజురాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కూడా సాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు.
@ మెట్పల్లి పట్టణంలో తప్పిపోయిన బాలుడి అప్పగింత.
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రిత్వచ్ఛారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాలింగ అర్చన చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మహాలింగార్చన ప్రమిదలను వెలిగించారు. మహా లింగార్చన కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల బహిరంగ లేఖ రాశారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తారా? అని పేర్కొన్నారు. దసరాకు జర్నలిస్టుల కుటుంబాల్లో పండగ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
కరీంనగర్ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై బండి సంజయ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? బతుకమ్మ పండుగకు ముందు జర్నలిస్టుల బతుకులతో ఆటలా?. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే?’ అని ప్రశ్నించారు.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ కట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తన పర్యటనలో భాగంగా డిల్లీలో మంత్రితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు శాఖ సంబంధమైన విషయాలను వారిరువురు చర్చించారు. సీఎం వెంట పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి తదితరులున్నారు.
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
హుస్నాబాద్: EWS రిజర్వేషన్ల వల్ల SC, ST, BC విద్యార్థులకు DSCలో తీవ్ర అన్యాయం జరిగిందని BC సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు పిడిశెట్టి రాజు అన్నారు. సమాజంలో 6 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.