Karimnagar

News October 7, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.

News October 7, 2024

కరీంనగర్: గునుగు పూలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు ఆదివారం ఉదయం గునుగు పూలు తేవడానికి వెళ్లాడు. పూలను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు.

News October 7, 2024

కరీంనగర్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. కాగా జగిత్యాలలో 382 గ్రామ పంచాయతీలు అలాగే సిరిసిల్ల-255, కరీంనగర్-323, పెద్దపల్లి జిల్లాలో 266 పంచాయతీలు ఉన్నాయి.

News October 7, 2024

ధర్మపురి: దసరా ఆఫర్ లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా లక్కీ డ్రా నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దసరా ధమాకా లక్కీ డ్రా అనే క్యాప్షన్‌తో అమాయకపు ప్రజల వద్ద నుంచి పలువురు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్, మేక, కుక్కర్, కోళ్లు, మద్యం బాటిళ్లు అని బహుమతుల పేర్లతో స్కీం నిర్వహిస్తున్న 8 మంది నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్ఐ మహేశ్ తెలిపారు.

News October 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మానకొండూరు మండలంలో విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ గుండెపోటుతో హుజురాబాద్ ఆర్టీసీ డిపో డ్రైవర్ మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు.
@ కరీంనగర్ జిల్లా గ్రంధాలయ చైర్మన్‌గా మల్లేష్.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా సత్యనారాయణ గౌడ్.
@ మెట్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో బతుకమ్మ సంబరాలు.

News October 6, 2024

నంది గరతుమంతుడి వాహనంపై ఊరేగిన రాజన్న

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారంరాత్రి స్వామి నంది గరుత్మంతుడి వాహనంపై విహరించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.

News October 6, 2024

కరీంనగర్: 21 ఆసుపత్రులకు గుర్తింపు

image

కరీంనగర్ జిల్లాలో 21 ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లాలో అందుతున్న ఆరోగ్య సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. ఇందులో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కాయకల్పకు ఎంపిక కావడం జరిగింది. మోతాజాఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంకు బెస్ట్ అవార్డు, బుట్టిరాజారాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం కమండేషన్ విభాగంలో కాయకల్ప గుర్తింపు దక్కించుకొని అవార్డుకు ఎంపికైంది.

News October 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాక జయంతి వేడుకలు.
@ కథలాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్.
@ కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు.
@ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనును కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్.

News October 5, 2024

హుజూరాబాద్‌లో దారుణ హత్య

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 5, 2024

కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ

image

జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్‌స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్‌శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.