Karimnagar

News February 18, 2025

కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

✓ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు✓ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌లో పత్తి ధర రూ.6,900✓ శంకరపట్నం మండలంలో తాగుడుకు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య✓ ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో మార్పులు✓ రామడుగు మండలంలో పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం✓ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నేతలు

News February 18, 2025

కరీంనగర్‌లో విషాద ఘటన

image

కరీంనగర్‌లో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం నూకపల్లి వాసి చెవులమద్ది స్రవంతి(29) 8నెలల గర్భిణి. ఆదివారం చెకప్‌కు జగిత్యాలకు వెళ్లగా హార్ట్, ఉమ్మనీరు ప్రాబ్లమ్ ఉందని HYDకి వెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను KNRకు తరలించి, చికిత్స అందించినప్పటికీ లోపల బిడ్డ మృతిచెందాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించి స్రవంతి కూడా మరణించింది.

News February 17, 2025

జగిత్యాల: యువకుడి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువకుడు మంతెన ప్రవీణ్(19) సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, ప్రవీణ్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

News February 17, 2025

BREAKING: గోదావరిఖని: నదిలో దూకింది..!

image

పెద్దపల్లి జిల్లా ముస్త్యాల గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కొద్దిసేపటి క్రితం గోదావరిఖని శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకిందని స్థానికులు తెలిపారు. నదిలో నీరు లేని ప్రదేశంలో పడటంతో ఆమెకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో కారణాలు తెలియాల్సి ఉంది.

News February 17, 2025

కరీంనగర్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

image

కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జనం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 17, 2025

కరీంనగర్‌తో కేసీఆర్‌కు విడదీయరాని బంధం

image

కరీంనగర్ అంటేనే.. కేసీఆర్ అని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటాయి. KCRకు KNR జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు 2001లో KNR గడ్డపైనే ప్రకటించారు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2018, మే 10న రైతుబంధును ఇక్కడే ప్రారంభించారు. త్వరలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను కరీంనగర్‌లోనే ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్.

News February 17, 2025

కరీంనగర్: ఇంటర్ విద్యార్థులకు మరొక అవకాశం

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం మరొక అవకాశం కల్పించింది. ఈనెల 3 నుంచి 16వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 22వరకు KNRలోని ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డీఐఈవోను సంప్రదించి అనుమతి తీసుకోవాలి.

News February 17, 2025

కరీంనగర్: నేటి నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి ఈ నెల 28 వరకు కంటి పరీక్షలు చేయనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిత అతహరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 1,730మందికి, HZB ఏరియా ఆసుపత్రిలో 858 మంది విద్యార్థులందరికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 858, HZB ఏరియా ఆసుపత్రిలో 100మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.

News February 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

image

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.

News February 17, 2025

కరీంనగర్ : నేటి సదరం క్యాంపు రద్దు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఈ నెలలో 17 & 18 తేదిలలో జరుగు సదరం క్యాంపులను నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీధర్ తెలిపారు. సదరం వెబ్‌సైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలు కారణంగా నేడు సోమవారం, మంగళవారం నిర్వహించే సదరం క్యాంప్‌లు రద్దు చేశామన్నారు. 

error: Content is protected !!