Karimnagar

News February 14, 2026

కరీంనగర్‌ యూనియన్‌ బ్యాంకులో అగ్నిప్రమాదం

image

కరీంనగర్ నగరంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక గదిలో మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న ఫర్నిచర్, రూఫ్ కప్పు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కరీంనగర్, మానకొండూరు నుంచి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

News February 14, 2026

హుస్నాబాద్: పద్మ, సుప్రజ మూడోసారి..

image

హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మ 50 ఓట్ల మెజార్టీతో, 18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి వాల సుప్రజ 302 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో వరుసగా వీరు మూడోసారి కౌన్సిలర్లుగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపించాయని వారు పేర్కొన్నారు.

News February 13, 2026

జమ్మికుంటలో దిగ్గజాలు కనుమరుగు.. కొత్త వారికి పట్టం!

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు వినూత్న తీర్పు ఇచ్చారు. రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలను పక్కనపెట్టి, ఉత్సాహవంతులైన కొత్త అభ్యర్థులను గెలిపించారు. ముఖ్యంగా గతంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవుల్లో పనిచేసి, పట్టణంపై పట్టున్న నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం గమనార్హం.

News February 13, 2026

జమ్మికుంట మున్సిపల్ కుర్చీకి తప్పని ‘ఎక్స్-అఫీషియో’ సెగ!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎక్స్-అఫీషియో ఓట్ల వినియోగం, స్వతంత్రుల మద్దతుపైనే జమ్మికుంట మున్సిపల్ పీఠం భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటిలోపు రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

News February 13, 2026

నలుగురి చేతిలో జమ్మికుంట భవితవ్యం..!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగు ఏర్పడడంతో BRS, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా AIFB అభ్యర్థితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు రెండు పార్టీల నుంచి భారీ ఆఫర్లు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు అభ్యర్థులు మద్దతు ఇచ్చినా సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటంతో జమ్మికుంట రాజకీయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

News February 12, 2026

KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

image

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.

News February 12, 2026

KNR: ‘సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

image

KNR మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని వైద్య బృందానికి సూచించారు.

News February 12, 2026

కౌంటింగ్‌ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్‌ ఆలం

image

కరీంనగర్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్‌ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.

News February 12, 2026

కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

image

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

News February 12, 2026

కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

image

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.