Karimnagar

News February 10, 2026

జమ్మికుంటలో ఓటుకు రూ.10 వేలు?

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఓటు విలువపై చర్చ వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఒక్క ఓటుకు రూ.10 వేలు, 25కిలోల రైస్ బ్యాగ్ అందిస్తున్నారని పట్టణమంతా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మహిళా ఓటర్లే లక్ష్యంగా నగదు రూ.5వేలు, వెండి కుంకమ భరణి, చీరలు బహుమతులుగా అందిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక రికార్డు బ్రేక్ చేస్తూ జరిగే మున్సిపల్ ఎన్నికలతో రాత్రికి రాత్రే అభ్యర్థుల భవిష్యత్ మారనుంది.

News February 10, 2026

ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని పోలింగ్ కేంద్రం వద్ద చూపాలని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.

News February 10, 2026

కరీంనగర్‌లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

image

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News February 10, 2026

1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 10, 2026

కరీంనగర్ జిల్లాలో 189 మంది బైండోవర్: సీపీ గౌష్ ఆలం

image

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 189 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు, 49 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

News February 10, 2026

కరీంనగర్: ముగిసిన పోలింగ్ సామాగ్రి తరలింపు

image

కరీంనగర్ నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి 477 కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి తరలింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణలో 93 బస్సుల్లో సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచే 66 డివిజన్లలోని 3.40 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.

News February 10, 2026

HZB,JMKT పుర పీఠం ఎవరికి వరించెనో?

image

కాంగ్రెస్, బిజేపీ బీఆర్ఎస్ పార్టీలు HZB,JMKT పుర పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. 30 వార్డుల్లో పాగా వేసేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం, ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి వంటి కీలక నేతలు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. 3 ప్రధాన పార్టీల నేతలు గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పుర పీఠం ఎవరికనేది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

News February 10, 2026

కరీంనగర్: పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది పయనం

image

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ సామాగ్రితో ఆయా కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని తీసుకున్న సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య తరలివెళ్లారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

News February 10, 2026

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్‌ పమేలా సత్పతి

image

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలోని పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బంది చెక్‌లిస్ట్‌ ప్రకారం సామగ్రిని తనిఖీ చేసుకోవాలని, నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

News February 10, 2026

కరీంనగర్‌‌లో త్రిముఖ పోరు. మేయర్ పీఠం ఎవరిదో?

image

కాంగ్రెస్‌, BJP, BRS.. KNR కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. 66 వార్డులు గల నగరంలో పాగా వేసేందుకు ఇప్పటికే బండి సంజయ్, పొన్నం, గంగుల వంటి కీలక నేతలు సహా స్థానిక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎంఐఎం కూడా ప్రభావం చూపే ఇక్కడ మెజారిటీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో పొత్తులు కుదిరే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది.