India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

KNRలో తెలంగాణా మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను కిరణ్ మాట్లాడుతూ.. FEB 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొత్త లేబర్ చట్టాలు, పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 81.47% శాతం పోలింగ్ నమోదైంది. గత 2020ఎన్నికల్లో నమోదైన 77.8 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం పెరగడం ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్లు సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని చెప్పారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 242వ బూత్‌లో ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారంటూ సాగుతున్న ప్రచారపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, రిటర్నింగ్ అధికారి ఎవరిని సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగిందని తెలిపారు.

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. 20వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొక్కుల శ్రీలత గెలుపు కోసం ఆమె ఏకైక కుమార్తె కొక్కుల మాధురి లండన్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. 8 నెలల పసికందుని వెంటబెట్టుకుని రావడం ఓటర్లను ఆకట్టుకుంది. తల్లిపై ప్రేమతో పాటు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పేలా మాధురి తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డుకు చెందిన రామ రాజమ్మ ( 97) అనే వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ పట్టుదలతో ఆమె ఆటోలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న వారి సహాయంతో లోపలికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని చాటి చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి ఎస్ఈ (R&B SE) కార్యాలయంలో ఏర్పాటు చేసిన 420వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటరులా క్యూలైన్లో నిలబడి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నైతిక విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.