India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ ప్రకాష్ గంజ్ లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజురోజుకూ పెరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆంబులెన్సులు 6, ప్రైవేట్ అంబులెన్సులు 36 వరకు ఉన్నాయి. అయితే పేషెంట్లు చెప్పిన ఆసుపత్రులకు కాకుండా తమకు కమిషన్లు ఇచ్చే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. పైగా రవాణా చార్జీలు విపరీతంగా తీసుకుంటున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని రెండుసార్లు అబార్షన్ చేయించి తనను మోసం చేశాడని కరీంనగర్ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలానికి చెందిన ఓ యువకుడు.. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వినాయక చవితిని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో బంతి, చామంతి పూల రేట్లను అమాంతంగా పెంచేశారు. మామూలు రోజుల్లో కిలోకు రూ.50 ఉండే బంతి పూలకు రూ.100, చామంతి పూలకు రూ.200, గులాబీ పూలకు రూ.250-300 వరకు అమ్ముతున్నాయి. కరీంనగర్ మార్కెట్లో భారీగా కొనుగోలుదారులు, వినాయక మండపాల నిర్వాహకులు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అధికారులు శుక్రవారం మూసివేశారు. నాలుగు రోజులుగా 32 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన అధికారులు.. శుక్రవారం ఉదయం 12గేట్ల ద్వారా 64వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నానికి 2 గేట్లు మాత్రమే తెరిచి నీటిని విడుదల చేశారు. సాయంత్రం పూర్తిగా గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 19.147 టీఎంసీల నీరు ఉంది.
@ వేములవాడ మైనార్టీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
@ సిరిసిల్లకు చెందిన గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి.
@ మల్హర్ మండలంలో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
@ ఓదెల మండలంలో ట్రాలీ ఆటో బోల్తా పలువురికి గాయాలు.
@ వినాయక పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితికి ముస్తాబైన మండపాలు.
గణేశ్ నవరాత్రులు ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ రోడ్ల మరమ్మత్తు విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురాగా వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండపాల నిర్వహకులు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలన్నారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయి. 24 గంటల్లో 23 ఆపరేషన్లు చేసి దవాఖాన సత్తా చాటారు. కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నారు. ఆసుపత్రిలో గత 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో వివిధ రకాల 23 ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 10 డెలివరీలు, 2 గర్భసంచిలో గడ్డ, 5 సాధారణ శస్త్ర చికిత్సలు, 1 కంటి ఆపరేషన్, 5 ఆర్తో ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.
సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి తనను ఎంతో బాధించిందని ఎమ్మెల్యే కేటీఆర్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. సిరిసిల్లలోని చేనేత కుటుంబాలు పుట్టిన ఆయన పలు రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, బంధువులు శ్రేయోభిలాషులకు సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.