Karimnagar

News January 8, 2026

పర్లపల్లి: ‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

image

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలను గురువారం ఆమె సందర్శించి, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీని అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక సిలబస్‌తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 33 ప్రీప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు.

News January 8, 2026

KNR: బ్యాంకుల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం హై-క్వాలిటీ సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు, బర్గ్లర్ అలారమ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదు తరలింపుపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

News January 8, 2026

KNR: ‘విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలి’

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ సమీపంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించిన ఆమె.. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సంగీతం, కుట్టు శిక్షణ, కంప్యూటర్ కోర్సుల ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.

News January 8, 2026

KNR: ‘నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్’

image

ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. తిమ్మాపూర్‌లో జరిగిన ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వాహనదారులు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అలవరచుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News January 8, 2026

KNR: తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలో హరిప్రసాద్‌

image

తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీల అధ్యయన కమిటీ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నియమితులయ్యారు. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ క్రమంలో వివిధ పార్టీల పనితీరును విశ్లేషించేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కవితకు అత్యంత విధేయుడైన హరిప్రసాద్‌కు రాష్ట్ర స్థాయి కమిటీలో చోటు దక్కడంపై జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

News January 8, 2026

కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.

News January 8, 2026

కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.

News January 8, 2026

KNR: ‘బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను విడుదల చేయాలి’

image

బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్‌ పాషా, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ చాంద్‌ పాషా ఉన్నారు.

News January 7, 2026

KNR: ‘పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఉండాలి’

image

కలెక్టరేట్‌, విద్యార్థుల రక్షణే ధ్యేయంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ‘స్నేహిత’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన VCలో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపుల నివారణకు ఈ పెట్టెలు కీలకమని, వీటి తాళాలు మహిళా కానిస్టేబుళ్ల వద్దే ఉంటాయని స్పష్టంచేశారు. విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.

News January 7, 2026

కరీంనగర్: ‘సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి’

image

సైబర్ నేరాల పట్ల మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ రమేష్ సూచించారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ మోసాలు, సైబర్ స్టాకింగ్‌పై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.