India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, డ్రోన్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శబ్ద కాలుష్యం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్ సెట్ల వినియోగానికి సంబంధిత ఏసీపీల అనుమతి పొందాలని ఆయన సూచించారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఒక్కరోజే 49 దరఖాస్తులు రాగా, నిన్నటివి 4 కలిపి మొత్తం 53 అభ్యంతరాలు అందినట్లు నగరపాలక అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి,ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యంను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పోస్టల్ శాఖ అకౌంట్‌లో జమ చేయకపోవడంతో వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోస్టల్ శాఖ రూ.3.5 లక్షల అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి వెంటనే సస్పెండ్ చేసింది.

శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో డాక్టర్ ఎస్.రమాకాంత్ పీజీ & ప్రొఫెషనల్ పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమకయ్యరు. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ రిజిస్టర్ ఉత్తర్వులు అందజేశారు. రమాకాంత్ ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషనరేట్ అధికారులు భారీగా చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికవ్వగా, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ సహా పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు మరింతమందికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Sorry, no posts matched your criteria.