India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గత పది రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 6,665 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,553 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి నిల్వ చేయవద్దని, డిమాండ్ మేరకు మరిన్ని నిల్వలు తెప్పిస్తామని రైతులకు సూచించారు.

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.

కేజీబీవీ విద్యార్థినులను విద్యావంతులుగా మార్చి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను కోరారు. ‘నీపా’ (NIEPA) సౌజన్యంతో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో ఆమె మాట్లాడారు. బాలికలు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డైరెక్టర్ దేబోర కృపారాణి అధికారులు పాల్గొన్నారు.

పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని నీరుగార్చడం లేదని, దానికి మరిన్ని సంస్కరణలు అద్ది ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్) చట్టంగా కేంద్రం బలోపేతం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ జిల్లా కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్‌లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రామడుగు మండలం వెదిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, తరగతి గదులను తనిఖీ చేసిన ఆమె.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, గ్రామం అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. KNR బొమ్మకల్‌లో నిర్వహించిన మహిళా సంక్షేమ సభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించాలని సూచించారు. అంగన్‌వాడీలో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తారన్నారు.

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.