India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 250 దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని బదిలీ చేశారు.

కరీంనగర్ జిల్లాలోని ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు ఈ నెలాఖరులోపు సందర్శించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధత, మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీరు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గ్యాస్ కనెక్షన్లు, విటమిన్ గార్డెన్ల నిర్వహణపై దృష్టిసారించాలని, సమస్యలను తమ దృష్టికి తేవాలన్నారు.

తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SRR డిగ్రీ, పీజీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ప్రారంభించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల తెలుగు విభాగం సహకారంతో సోమ, మంగళవారాల్లో ఈ కార్టూన్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలలకు చెందిన వివిధ కార్టూనిస్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అన్నారు.

హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్(27) బైక్ అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొని మృతిచెందాడు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన మనోహర్ హుస్నాబాద్-కరీంనగర్ మార్గంలో సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. 108 సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

KNR జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ సహా జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి లాటరీ పద్ధతిన ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

KNR కార్పొరేషన్ 66 వార్డుల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ జనరల్: 28
ఎస్సీ మహిళ: 27, 30, 53
ఎస్సీ జనరల్: 4, 20, 25, 29
బీసీ మహిళ: 1, 5, 17, 33, 35, 43, 45, 47, 48, 54, 62, 64
బీసీ జనరల్: 10, 14, 31, 32, 34, 36, 37, 39, 46, 58, 59, 61, 63
జనరల్ మహిళ: 3, 7, 9, 11, 12, 13, 15,19, 38, 40, 41, 44, 49, 52, 55, 56, 57, 60
జనరల్: 2, 6, 8, 16, 18, 21, 22, 23, 24, 26, 42, 50, 51, 65, 66

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్‌కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

జహీరాబాద్, సంగారెడ్డిలోని మహీంద్రా సంస్థలో 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై, 18-25 ఏళ్ల వయసున్న కరీంనగర్ జిల్లా గ్రామీణ యువత దీనికి అర్హులు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కరీంనగర్‌లోని స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు
Sorry, no posts matched your criteria.