India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల విధులు, ట్రాఫిక్ నియంత్రణలో విశేష సేవలందించిన ఎన్‌సీసీ క్యాడెట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. అస్త్ర కన్వెన్షన్ హాలులో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రమశిక్షణతో పోలీసులకు అండగా నిలిచిన క్యాడెట్ల సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ వీరి సేవలను వినియోగించుకుంటామని సీపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్ మున్సిపాలిటీ 1941లో ఏర్పడి, 2005 మార్చి 5న మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది, ఇది మొదట థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా 1952లో ప్రారంభమై, 1959లో సెకండ్ గ్రేడ్, 1984లో ఫస్ట్ గ్రేడ్, 1996లో స్పెషల్ గ్రేడ్, 1999లో సెలక్షన్ గ్రేడ్ స్థాయికి చేరింది. ఇది సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా ఏర్పడి, ఎలగందుల నుంచి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత నగర పాలక సంస్థగా విస్తరించింది.

ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బూత్ స్థాయి పోలింగ్ అధికారులు వృద్ధ ఓటర్లకు సన్మానం చేయాలని పేర్కొన్నారు.

మల్టీ జోన్-1 పరిధిలో పరిపాలనా కారణాలతో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గుర్రం తిరుమల్‌ను టౌన్-III ఎస్‌హెచ్‌ఓగా, వీఆర్‌లో ఉన్న వి.పుల్లయ్యను మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అలాగే డబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎండీ రఫీక్ ఖాన్‌ను వీఆర్‌కు, ట్రాఫిక్-II ఇన్‌స్పెక్టర్ పార్స రమేష్‌ను మందమర్రి కి బదిలీ చేశారు.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మీడియా పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలను వీరికి అప్పగించారు.

కరీంనగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ కోసం కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు మక్కువ చూపుతున్నారు. పలువురు టికెట్ల కోసం.. మంత్రులు, వివిధ హోదాలో ఉన్న వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనికి చెక్కు పెడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇంఛార్జ్‌గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించింది.

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్‌లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.

విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.

సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందని, విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

వీణవంక మండలం చల్లూరులో అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఇసుక తవ్వుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని విచారణ కమిటీ తేల్చింది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. డీజీపీఎస్ సర్వే ప్రకారం చల్లూరు పరిధిలోనే మైనింగ్ జరిగిందని, ఇప్పలపల్లిలో అక్రమ తవ్వకాలు జరగలేదని నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బావులను తొలగించారని, నిబంధనలు పాటించాలన్నారు.
Sorry, no posts matched your criteria.