India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కొంపల్లిలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శ్రీగాధ మనోహర్(25) HYDలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఉరేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరిలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా KNR రీజియన్‌లో మంగళవారం నుంచి 1,740 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రాజు తెలిపారు. JBS నుంచి KNRకు 770, తిరుగుప్రయాణంలో KNR నుంచి JBSకు ఈనెల 16 నుంచి 22 వరకు 970 బస్సులను నడవనున్నట్లు చెప్పారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను HYD మీదుగా నడపనుననట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,752 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.59,516, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,895, అన్నదానం రూ.17,341 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరిలోపే ఎలక్షన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే ఆశావహులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముందస్తు దావతులు ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈసారి సర్పంచ్ బరిలో నిలిచేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.
ఉమ్మడి KNR జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29,98,815 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా KNR నియోజకవర్గంలో 3,68,269 మంది ఉండగా.. 2,16,389 మంది ఓటర్లు అతి తక్కువగా రామగుండంలో ఉన్నారు. KNR(D) 10,83,365, జగిత్యాల(D) 7,20,825, PDPL(D) 7,18,042, SRCL(D) 4,76,604 ఉండగా.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,51,150 మంది ఓటర్లు ఉన్నారు.
వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల వెటర్నరీ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెటర్నరీ రంగం రైతుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందని, పశుసంవర్ధక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగవుతుందన్నారు. విద్యార్థులు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించారు.
ఆధునిక టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ విస్తరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు ‘డేటా ఎకానమీ’ నూతన వర్క్ స్టేషన్‌ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించి మాట్లాడారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయని అన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
KNR జిల్లా గన్నేరువరం మండలం కాశింపేటలోని 800ఏళ్లనాటి మానసాదేవి మహాక్షేత్రం ప్రత్యేకమైనది. దేశంలో వెలసిన 2 స్వయంభు ఆలయాల్లో మొదటిది హరిద్వార్‌లో ఉండగా.. రెండోది మన జిల్లాలోనే ఉండటం విశేషం. అమ్మవారు కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారితో పాటు దాదాపు 108 నాగదేవతల విగ్రహాలు ఉన్నాయట. గత ఆరేళ్లలో సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.
@ తంగళ్ళపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. @ గంభీరావుపేట మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరికి గాయాలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. @ మంథనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ గంగాధర మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం.
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.