India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.
కొత్త సర్కారులో గ్యాస్ బండ రాయితీ వస్తుందని సంబరపడిన వినియోగదారులకు భంగపాటు తప్పడం లేదు. ఒక్కో గ్యాస్ బండకు వినియోగదారుడు సుమారు రూ.842 చెల్లిస్తున్నాడు. తర్వాత ఒకటి నుంచి ఐదు రోజుల్లో రూ.340 పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ సొమ్ము పడాలి. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కారేపల్లి, ఇల్లెందు తదితర మండలాల్లో అది జమకావడం లేదు. ఫలితంగా ఆయా వినియోగదారులు రాయితీ సొమ్మును కోల్పోవాల్సి వస్తోంది.
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలని ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని, డీఎస్సీకి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉందని, చదువుకునేందుకు తగిన సమయం కేటాయించాలన్నారు. పరీక్షను మరో 3 నెలల అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు.
ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చర్ల మండలం కుదునూరు జీపీ బోటిగూడెంకి చెందిన కే.సరోజిని (23), కలివేరుకి చెందిన రాజేశ్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సరోజిని పెళ్లి ప్రస్తావన తీసుకురాగా రాజేశ్ నిరాకరించాడు. మనస్తాపంతో సరోజని శనివారం పురుగుమందు తాగింది. అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా
ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మీనారాయణ ఆదివారం ఇంట్లో టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలాడు. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రి లేని అనాథ ముస్లిం విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 కల్లా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్ను సంప్రదించాలన్నారు.
ఈ ఏడాది పత్తి సాగు లక్ష్యానికి
దూరంగా ఉంది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. వరి 2.83 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, పత్తి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది పత్తి సాగు అంచనాను 2,01,834 ఎకరాలకు తగ్గించారు. అయినా ఆ లక్ష్యం మేరకు కూడా నెరవేరడం ప్రశ్నార్థకంగానే మారింది. శనివారం నాటికి 1,81,794 ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
✓ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
✓ ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం పర్యటన
✓ సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎంYSR జయంతి
✓ పలు శాఖల పై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తండ్రీకొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్ ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనయుడు ఇమ్మానియేలు (25) డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవికిరణ్ తనయుడికి సూచనలు ఇవ్వడంతోపాటు తానూ పరీక్ష రాశారు. రిజర్వేషన్, ఇన్ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో పరీక్ష రాయగలిగినట్టు వివరించారు.
Sorry, no posts matched your criteria.