India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మువ్వ విజయబాబు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మువ్వ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న ఆయకట్టు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు కింద 24,700 ఎకరాలు, అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కింద 2,360 ఎకరాలు, పాల్వంచలో కిన్నెరసాని ప్రాజెక్ట్ కింద 10,000 ఎకరాలు, బయ్యారం పెద్ద చెరువు కింద 7,200 ఎకరాలు సాగవుతున్నాయి.

జేగురుకొండ అడవుల్లో శనివారం జరిగిన ఎన్ కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జేగురుకొండ అడవు ల్లోని సింగవరం, తుమర్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డీఆర్డీ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక తుపాకీ, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఉన్న తాలి పేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లు మొత్తం ఎత్తి 55,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 52,897 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి వరదనీరు భారీగా వస్తున్నట్లు వెల్లడించారు.

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలియజేశారు. ఎగువనుంచి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో గోదావరిలోని వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో క్రమేపీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వివిధ చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వైరా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండగా, లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. జలవనరులశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,054 చెరువులు, చెక్ డ్యామ్లు ఉండగా శనివారం వరకు 385 చెరువులు, చెక్ డ్యాంలు నిండాయి.

జిల్లాలో ప్రాథమిక విద్యను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. కేవలం ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు 234 ఉన్నాయి. విద్యా రంగ పటిష్ఠతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. కానీ, ఉపాధ్యాయుల కొరత సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలల విద్యార్థులు పటిష్ఠ బోధనకు దూరమవుతున్నారని వివిధ సర్వేలు తేల్చాయి.

ఖమ్మం జిల్లాలో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు అధికంగా ఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేశారు. ఈ మేరకు 150 మంది ఉపాధ్యాయులను గుర్తించగా శనివారం జాబితాను ఉన్నతాధికారులకు పంపించినట్లు డీఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం రాగానే వారిని అవసరమైన పాఠశాలలకు కేటాయించనుండగా సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుందని వెల్లడించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి రోడ్డు ప్రమాద ఘటనలు భయంకరంగా పెరుగుతున్నాయి. నిత్యం రోడ్డుప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అజాగ్రత్త, అతివేగం, మద్యపానం చేసి వాహనాలు నడపడమేనని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు.

భారీ వర్షాల వల్ల ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా తడిసిన మోటార్లతో రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు. ప్రజలు ఇంటి సర్వీస్ వైర్లని కాని, వాటితో వేలాడే ఇనుప తీగలను కానీ బట్టలు ఆరేసుకునే తీగలకు దగ్గరలో విద్యుత్ వైర్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు తెలపాలని కోరారు.
Sorry, no posts matched your criteria.