India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్‌కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు 34 అడుగుల మేర ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.

ఆలుబాకకు చెందిన బానారి రాజు చేపలకు వేటకు వెళ్లి గోదావరిలో ప్రమాదవశాత్తు నిన్న గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రాజు మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. రాజు మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

పెద్దవాగు కథ చాలా పెద్దదే. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఆయకట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రాజెక్టు కు భారీ వర్షాలకు గండి పడింది. చుక్కనీరు లేకుండా పోయింది. 18 వేల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారింది. ఏజెన్సీ వర ప్రధాయినిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు అశ్వారావుపేట మండలంలో ఉంది. దాని ఆయకట్టు మాత్రం ఏపీలోని ఏలూరు జిల్లాలో విలీనమైన వేలేరుపాడు మండలంలో ఉంది.

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశామన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇన్నాళ్లు వట్టిపోయిన జలాశయాలకు కళ వస్తోంది. ఖమ్మం జిల్లాలోని 984 చెరువులకు గాను శుక్రవారం నాటికి 24 చెరువులు అలుగు పారుతున్నాయి. బేతుపల్లి చెరువులోకి 16 అడుగులకు గాను 17 అడుగులు, జాలిముడి ప్రాజెక్టులోకి 15 అడుగుల పూర్తి స్థాయి మట్టానికి గాను 15.24 అడుగుల మేర నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. ఇక జిల్లాలోని 860 చెరువుల్లో 25 నుంచి 50 శాతం మేర నీరు చేరింది.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది శనివారం ఉదయం 9 గంటలకు 32.8 వద్ద గోదావరి ప్రవహిస్తుందని అధికారులు తెలియజేశారు. సాయంత్రం వరకు 40 అడుగులు చేరే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో వరద తీవ్రతపై CM రేవంత్ రెడ్డి జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద భారీగా వస్తున్న కారణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. కాగా సెలవుల్లో కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

భద్రాచలం గోదావరి వద్ద ఉ.9 గంటలకు గోదావరి నీటిమట్టం మరో అడుగు పెరిగిందని CWC అధికారులు తెలిపారు. 32.2 అడుగులకు నీటిమట్టం చేరిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.
Sorry, no posts matched your criteria.