India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 124 ఎత్తిపోతల పథకాల కింద 32,880 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 74 ఎత్తిపోతల పథకాలు సాగునీరందిస్తున్నాయి. 50 లిఫ్టులు పూర్తిగా పడకేశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఉభయ జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరైనా పనులు జాప్యమవటంతో ఈ సీజన్కు సాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు వానాకాలం సాగుకు ఊతమిస్తున్నాయి. వేసిన పంటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పుడమి తల్లి పచ్చదనంతో మురిసిపోతుంది. దాదాపు ఎండిపోయే స్థితిలో ఉన్న పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రాణం పోస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న, వరి నారుమళ్లు ఇలా వానాకాలం సాగు ఆరంభంలో వేసిన పొలాలన్నీ పచ్చదనంతో మెరుస్తున్నాయి.
ఆరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. ఇల్లెందు మండలంలోని ఓ తండాకు చెందిన భార్యాభర్తలు వ్యవసాయ కూలీలు. పాపను తాత వద్ద వదిలేసి గురువారం పనికి వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ బయటకెళ్లగా అదే తండాకు చెందిన యువకుడు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కేసులో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. కులం పేరుతో తన భర్తని ఈ అయిదుగురు వేధించారని శ్రీనివాస్ భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సీఐని ఐజీ కార్యాలయానికి, కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు.
✓పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓మణుగూరు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
✓భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. రైతులకు అందించే రైతు భరోసా నిధులపై ఇటీవల రాష్ట్ర రైతాంగం నుంచి సేకరించిన అభిప్రాయాలపై వారు చర్చించారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 24 వరకు నిర్దేశించిన తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు ధ్రువీకరణ పత్రం కోసం దగ్గర్లోని మీసేవ సెంటర్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. క్యాంపుకు వచ్చే దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకున్న రసీదు, ఆధార్ కార్డు, మెడికల్ రిపోర్ట్, పాస్ ఫొటో తీసుకురావాలన్నారు.
మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు, మూడు లక్షల జరిమానాను విధిస్తూ మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరిరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. గుత్తుల శ్రీనివాసరావు వద్ద సుందరయ్యనగర్‌కి చెందిన చింతల రాజారాం 2015 సంవత్సరంలో 3 లక్షల అప్పుగా తీసుకుని డబ్బు కోసం తిరగ్గా చాలా రోజుల తర్వాత చెక్‌ను ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.
ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెం వద్ద రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.
కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.