India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కమీషనర్ అభిషేక్ అగస్త్య కఠిన చర్యలు ప్రారంభించారు. రాబోయే 15 రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి షాప్‌కు ఒక కిలో బయోడీగ్రేడబుల్ కవర్లను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గడువు తర్వాత ప్లాస్టిక్ వాడే సంస్థలపై జరిమానాలు విధిస్తామన్నారు. పర్యావరణహిత క్లాత్ లేదా జూట్ బ్యాగులు వాడాలని విజ్ఞప్తి చేశారు.

∆} ఖమ్మం జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో ఎంపీ రామసహాయం పర్యటన.

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో అప్పుల బాధ భరించలేక యువ కౌలు రైతు గడ్డి మందు తాగాడు. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరు(27) 15 ఎకరాల కౌలు భూమి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో చేసిన రూ.20లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన దీక్షకు నేటితో 16 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) 8వ తరగతి పరీక్షా కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6వ తేదీలోపు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి చైతన్య జైని తెలిపారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కీని పరిశీలించి, అభ్యంతరాలను డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, తెలంగాణకు నేరుగా సమర్పించాలని, గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించబోమని డీఈఓ స్పష్టం చేశారు.

∆} ఖమ్మంలో మూడో రోజు కొనసాగుతున్న నామినేషన్
∆} బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ వేడుకలు
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం భద్రాద్రిలో ఎంపీ రామసహాయం పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల ఏకగ్రీవం చేసేందుకు ప్రధాన పార్టీల నాయకులు చూస్తున్నారు. ఇందుకు బుజ్జగింపులు, నగదు, పదవీ ఆశలు చూపుతూ పోటీ చేద్దామనుకునే వారిని తమ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు. ఇక పలు చోట్ల సర్పంచ్ పదవి కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కువ పాడితే వారినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామ రావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

ఖమ్మం నగరంలో శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సందర్శించి తపాల శాఖ స్టాంపులను ఆసక్తిగా తిలకించారు. మొత్తం 108 ప్రేముల్లో 3,456 జాతీయ, అంతర్జాతీయ స్టాంపులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. పిలాటికల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.