India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.
ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 58 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200కోట్ల చొప్పున మొత్తం 11,600కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.
మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పది, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో శనివారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 13,827 మందికి గాను 13,575 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,121 మంది విద్యార్థులకు గాను 2,036 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 337 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
‘సాగు నీళ్లు కరవై.. పొలం బీళ్లై’ శీర్షికన Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన కథనానికి అదనపు కలెక్టర్ శ్రీజ స్పందించారు. ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాలని, తద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆమె వెంట మండల అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.