India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలోని ప్రాధాన్యత ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రధాన కాలువకు భూసేకరణ ముగించి, మిగిలిన అటవీ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. కొందరు దుకాణాల యజమానులు గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు DSO చందన్ కుమార్ తెలిపారు.
సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. హోటళ్లు, వాణిజ్య సంస్థల్లో వీటిని వాడటం చట్టవిరుద్ధమని, ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరం దాడులు చేయాలని ఆదేశించారు. వినియోగదారులు ఓటీపీ ద్వారానే డెలివరీ తీసుకోవాలని, అక్రమాలపై ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి రామలింగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ Ex.Mlc, BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి నెల్లూరు కోటేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జిల్లా నుంచి వీ.పుల్లారావు యాదవ్‌ను సైతం నియమించింది.

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు నాంది పలుకుతూ సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NMPBతో పాటు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మనవడు ఎంపీ శ్రీ భరత్‌తో పాటు కావూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మధు యాష్కీ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. NPDCL ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 79016 28348 నంబర్‌కు Hi అని సందేశం పంపి, మీ సర్వీస్ నంబర్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యాక IVRS ద్వారా నిర్ధారణ చేసుకునే పారదర్శక విధానం కల్పించారు. అత్యవసరసమయాల్లో 1912కు కాల్ చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.

యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీలు సరఫరా నిలిపివేయడంతో జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సిలిండర్ల కొరతతో భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవ్వగా.. అ.కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భోజనానికి ఆటంకం తొలగిందని, ముందస్తు నిల్వలు పెంచుతున్నామని DBCDO జ్యోతి తెలిపారు.
Sorry, no posts matched your criteria.