India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం-బోనకల్ రహదారిలోని అగ్రహారం వద్ద రూ.18.50 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి (RUB) పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2021లో శంకుస్థాపన చేసినా, కోవిడ్, విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్పు వల్ల పనులు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సదరం అమలు, ధ్రువీకరణ పత్రాల జారీపై సెర్ప్ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఖమ్మం జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తైనట్లు డీఎంహెచ్‌ఓ డా.రామారావు తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు 2.55 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించగా 1,369 మంది అనుమానితులను గుర్తించారు. తుది పరీక్షల అనంతరం 5 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.

నవంబర్ నెలకు సంబంధించి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారుల ర్యాంకులను సంస్థ ప్రకటించింది. అర్బన్ విభాగంలో ఏడీఈ నాగార్జున, ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో ఏఈ అనిల్ కుమార్ ర్యాంకులు సాధించారు. సర్కిల్ స్థాయిలో డీఈ రాములు, ఏడీఈ యాదగిరి, రామారావు, ఏఈ రవికుమార్, అబ్దుల్ ఆసీఫ్ ప్రతిభ కనబరిచారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన అధికారులను పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.