Khammam

News January 3, 2026

KMM: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఆస్పత్రులు సీజ్: డీఎంహెచ్‌ఓ

image

ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆస్పత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామారావు హెచ్చరించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యతని, చట్టవిరుద్ధంగా భ్రూణ హత్యలకు ప్రోత్సహిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. వైద్యులు, యజమానులు నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు.

News January 2, 2026

ఖమ్మంలో త్వరలో ‘హరిత’ హోటల్.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. పర్యాటకులకు నాణ్యమైన భోజనం, విడిది సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన అనువైన స్థలాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

News January 2, 2026

‘పొలం బాట’తో రైతుల విద్యుత్ కష్టాలకు చెక్: ఎస్‌ఈ

image

అన్నదాతల విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘పొలం బాట’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 557 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, వేలాడుతున్న వైర్లు మరియు వంగిన స్తంభాలను సరిచేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎత్తైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలను ఏర్పాటు చేశామన్నారు.

News January 2, 2026

స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

image

పెనుబల్లి మండలం గణేశ్ పాడు సమీపంలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకెళ్లడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 2, 2026

స్కూల్ బస్సు బోల్తా ఘటనపై మంత్రి తుమ్మల ఆరా

image

వేంసూరు మండలం మొద్దులగూడెంలో వివేకానంద్ స్కూల్ వ్యాన్ పెనుబల్లి మండలం గణేశ్ పాడు వద్ద బోల్తాపడిన ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాతీశారు. సంబంధిత శాఖలను అప్రమత్తం చేయడంతో పాటు మంత్రి కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో మాట్లాడారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందేలా సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 2, 2026

అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దు: జిల్లా కలెక్టర్

image

రైతులు ఎవరు ప్రస్తుత అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతం అధికంగా కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటే యూరియా యొక్క నాణ్యత దెబ్బ తిని పంట నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో వారికి ముందస్తుగానే సమాచారం అందిస్తూ కూపన్లు కూడా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 2, 2026

కార్మికుల పిల్లల ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి పథకం కింద 2024–25 విద్యా సంవత్సరానికి మెరిట్ ఉపకార వేతనాల కోసం కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.కృష్ణవేణి తెలిపారు. ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 10వ తరగతి, ఐటీఐ విద్యార్థులకు రూ.1000, పాలిటెక్నిక్‌కు రూ.1500, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు రూ.2000 చొప్పున వేతనాలు అందజేస్తామన్నారు.

News January 2, 2026

ఈనెల 3న ఖమ్మం నగరంలో జాబ్ మేళా.!

image

ఖమ్మంలో ఈనెల 3న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థ వరుణ్ మోటార్స్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 133 ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు అర్హులని అన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు ఖమ్మం ఇల్లందు రోడ్డులోని వరుణ్ మోటార్స్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.

News January 1, 2026

టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

image

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News January 1, 2026

అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

image

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.