Khammam

News January 4, 2026

ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 3, 2026

ఖమ్మం:’ ఓటరు జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి’

image

ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా–2025 ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బీఎల్ఓలు రోజుకు 30, సూపర్‌వైజర్లు 300 ఎంట్రీల చొప్పున లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేశారు.

News January 3, 2026

ఖమ్మం: స్కూల్‌ బస్సు డ్రైవర్లకు ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ పరీక్షలు

image

జిల్లాలో పాఠశాల బస్సు ప్రమాదాల నివారణకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పెనుబల్లి మండలంలో నిన్న స్కూల్ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టి, బస్సులను నిలిపివేసి డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 3, 2026

యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సాగుదారులు ఆందోళన చెందవద్దుని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం నాగులవంచ వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 13,795 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

News January 3, 2026

నేరాల నియంత్రణే లక్ష్యం: ఖమ్మం సీపీ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లాలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని సీపీ సునీల్ దత్ తెలిపారు. శనివారం ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2026

ఖమ్మం బస్టాండ్‌లో బాదుడు.. నిబంధనలకు పాతర!

image

ఖమ్మం నూతన బస్ స్టేషన్‌లో తినుబండారాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న స్టాళ్లలో ఎంఆర్‌పీ నిబంధనలను గాలికి వదిలేసి, స్నాక్స్, వాటర్ బాటిళ్లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికులు ప్రశ్నిస్తే నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు కళ్లెం వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

News January 3, 2026

ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో మందులు నిల్!

image

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్‌లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

News January 3, 2026

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

image

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2026

ఖమ్మం: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు

image

ఖమ్మం నగరంలో టెట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 9 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని తెలిపారు. ఉ.9 నుంచి 11 వరకు ఒక సెషన్, మ.2 నుంచి సా.4:30 వరకు మరో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కాగా పరీక్షలకు మొత్తం 20,547 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

News January 3, 2026

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ ఖమ్మం నగరంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
☆ సత్తుపల్లి (మం) రామానగరంలో నేడు రక్తదాన శిబిరం
☆ జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ పక్రియ
☆ జిల్లాలో పర్యటించనున్న కలెక్టర్ అనుదీప్
☆ ఖమ్మంలో నేటి నుంచి టెట్ పరీక్షలు
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన