India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నందున అటువైపు వెళ్లవద్దని, రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బుధవారం ఉ.8:30 నుంచి 11 గంటల వరకు 437.6 M.M రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వైరాలో 61.4 నమోదు కాగా.. అటు కొణిజర్ల 41, NKP 37.5, TLD 20.9, R.PLM 33.1, YPLM 37.5, వేంసూరు 18.0, KMM(U) 27.0, SPL 14.1, KMM(U) 24.3, ENKR 19.5, MDGD 13.7, సింగరేణి 8.3, KMPL 6.8, CTKN 33.6, KSMC 5.3, PNBL 3.5, BNKL 19.0, T.PLM 0.3, మధిర 12.8 M.M నమోదైంది.

చెల్లని చెక్కు కేసులో ఖమ్మంకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్తుపల్లి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. కల్లూరుకు చెందిన రామనరసింహారావు వద్ద ఉపాధ్యాయుడు జయరాజు 2015లో రూ.8.5 లక్షలు అప్పు తీసుకున్నారు. 2016లో తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లలేదు. దీంతో రామనరసింహారావు కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం జడ్జి ఈ తీర్పు ఇచ్చారు.

పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటల సాగు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించాలన్నారు. రైతులు పంటల సాగు వివరాలు నమోదు చేయించకపోతే ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

ఖమ్మం నగరంలో త్వరలో ప్లాస్టింగ్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రారంభిస్తామని నగర మేయర్ నీరజ అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు ఖమ్మంలో కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.

త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం అలవర్చుకోవచ్చని పోలీసు అధికారులకు సూచించారు. మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలు, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేసులకు సంబంధించి న్యాయస్థానంలో శిక్షలు పడేలా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వినాయక నవరాత్రి ఉత్సావాల్లో ప్రజా భద్రతతో పాటు ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా అధికారులు సమష్టిగా కృషిచేయాలని సీపీ సునీల్ దత్ అదేశించారు. పోలీస్ కాన్ఫిరెన్స్ హల్‌లో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విధిగా మండపాలను సందర్శించి నియమ, నిబంధనలు పాటించేలా చూడాలని చెప్పారు. వినాయక నవరాత్రి ఉత్సావాలకు పటిష్టమైన బందోబస్తు చేయాలన్నారు.

మహిళలు లాభసాటి వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం కావాలని, మరొకరికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం నగరం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా, శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంను సందర్శించారు. మహిళా ప్రాంగణం పరిసరాలను కలియ తిరిగిన కలెక్టర్, ప్రాంగణానికి కావలసిన మౌళిక సదుపాయాల గురించి మహిళా ప్రాంగణం మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.

బిహార్‌లో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా AICC అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న యాత్రకు తమ మద్దతు తెలిపారు.

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ప్రభుత్వ, లోకల్ బాడీ, ఎయిడెడ్, కేజీబీవీ, తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల యాజమాన్యాల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. హెచ్ఎంలకు 15 సంవత్సరాలు, ఉపాధ్యాయులకు 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలన్నారు. ఈ నెల 28 లోగా డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో ధ్రువీకరించి అందజేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.