India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయమై అర్హులై, ప్లాట్లు ఉన్న ఎల్1 జాబితాను ఎంపీడీవో సంతకంతో తీసుకుని ఆమోదం కోసం ఇందిరమ్మ కమిటీ ముందు ఉంచాలని సూచించారు. అలాగే వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన ఏసుదాస్ డేవిడ్(43) పెళ్లి చేసుకుంటా అని యువతిని(21) గర్భవతిని చేశాడు. సీఐ జె.ఉపేందర్ వివరాలు.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నా అంటూ శారీరికంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేవడంతోమొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
∆} వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
ఖమ్మం జిల్లాలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మంగళవారం ముగిసింది.115 మంది సీఈలు, 530 మంది ఏఈలు, 150 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధులు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన మూల్యాంకనం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ పర్యవేక్షించారు. కాగా స్పాట్ వేల్యూషన్కు హాజరు కాని 64 మంది ఉపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు పంపారు.
ఖమ్మం జిల్లా లోని మధిర, వైరా, కల్లూరు మినీ స్టేడియాల్లో క్రీడా కారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి సునిల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎన్ఐఎస్ శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 22 కల్లా తమ దరఖాస్తులను సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలని కోరారు.
మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా 30 అడుగుల ఎత్తులో ఆర్సీసీ కాంక్రీట్ గోడలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఖమ్మం పట్టణంలోని ఆరు కాలనీలు, పాలేరు నియోజకవర్గంలోని రెండు కాలనీలను వరద సమయంలో రక్షించడానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే అధికారులు సమీక్ష నిర్వహించి తగు చర్యలు ప్రారంభించారు.
ఖమ్మం గాంధీ చౌక్‌లోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నందు ఈనెల 17న ఉదయం 10 గంటలకు మహిళలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 30-45 సంవత్సరాల వయస్సు కలిగి, డిగ్రీ పాసైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.20.19 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి రూ.లక్ష చొప్పున విడుదల చేసినట్లు ప్రకటించారు.
ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకానికి 91,850 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 29,091, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 14,220, బీసీ కార్పొరేషన్ ద్వారా 41,881, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 6,658 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన ధరఖాస్తులన్నిటిని ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.