India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.

మధిర మండలం ZPHS దెందుకూరులో తెలుగు ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావుపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల ఆయన అనుచితంగా ప్రవర్థించాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్‌ను ఎంక్వయిరీ అధికారిగా నియమించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని కూడా విచారణ బృందంలో చేర్చారు.

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్ చాట్ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.