India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని 697 పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రానున్న రెండు నెలలు సెలవులపై వెళ్లరాదని ఆదేశించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన విధుల అనుభవంతో లోక్ సభ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేలా, అత్యధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజున కూల్ వాటర్, ప్రతి పోలింగ్ గదిలో నాలుగు ఫ్యాన్లు, బయట షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం మండలంలోని బోడు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడు గ్రామానికి చెందిన కల్తీ చంద్రశేఖర్ కుమార్తెని తల్లి మందలించడంతో మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 230 కిలోల నిషేధిత ఎండు గంజాయిని మంచుకొండ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్చేసినట్లు అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ తెలిపారు. ఖమ్మం 1 టౌన్, తల్లాడ, వైరా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వివిధ తనిఖీల్లో ఈ నిషేధిత గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ అక్రమ గంజాయి రవాణా కేసులో మొత్తం 13 మంది నేరస్థులను అరెస్టు చేశామని వారు చెప్పారు.

కనగల్, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా సర్వే పుర్తైంది. డోర్నకల్ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి మీదుగా.. గద్వాల వరకు రైల్వే లైను ప్రాథమిక సర్వే పూర్తి అయింది. దీంతో ఖమ్మం, నల్గొండ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. దానిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామేపల్లి మండలం గోవింద్రాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన భూక్య మధు(17) ఇంట్లో ఏం పని చేయకుండా ఉండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు

తెలంగాణ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుస ఘటనలతో కసి మీద ఉన్న మావోయిస్టులు తమ వ్యూహాలకు పదును పెట్టి రెచ్చిపోతారని నిఘా వర్గాల సమాచారంతో బేస్ క్యాంపులకు పెద్ద ఎత్తున అదనపు బలగాలను రప్పిస్తున్నారు. తాజా పరిస్థితులను ఎస్పీ ఆరా తీస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులపై విత్తన భారాన్ని తగ్గించేందుకు
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్వం మాదిరి రానున్న వానాకాలం నుంచి రాయితీపై విత్తనాలను రైతులకు సరఫరా చేసే అంశంపై వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించింది. రైతులకు విత్తన భారం నుంచి వెసలుబాటు కల్పించేలా పూర్వ విధానాన్ని అమలు చేయడమే కాక మరికొన్ని ప్రయోజనాలను అమలు వర్తింపచేసేందుకు తాజాగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,700 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.800 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.25 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.