India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత శిక్షణ ఉమ్మడి ఖమ్మం సహా 23 జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ఆదివారం తీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. బంజారా, లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ముగింపు సందర్భంగా యువతులు నృత్యాలతో సందడి చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మాధినేని నారాయణను కేరళ ఎమ్మెల్యే కె.కె.రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం అవసరమని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. తల్లాడలో అత్యధికంగా 6.2 మి.మీ., నెలకొండపల్లిలో 3.6, సింగరేణిలో 2.6, వైరాలో 1.2, కామేపల్లిలో 1.0, ఎన్కూరులో 0.8 మి.మీ. వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని, జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీ.గా ఉందని అధికారులు పేర్కొన్నారు

మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు.

ఖమ్మంలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది. బంద్‌కు సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎగువన వర్షాలు అధికంగా కురుస్తున్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మున్నేరు నదికి వరదలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టరేట్‌లో టోల్-ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫిర్యాదు చేయడానికి 1077, 9063211298 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

మున్నేరు వరద ఉధృతి నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, వాలంటీర్లను నియమించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను కేవలం బాధ్యతగా కాకుండా, పౌర సేవగా భావించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.