Khammam

News August 14, 2024

వైరాలో సీఎం బహిరంగ సభా వేదిక సిద్ధం

image

వైరాలో రేపు జరిగే CM రేవంత్ రెడ్డి రైతు సదస్సు బహిరంగ సభా వేదిక సిద్ధమైంది. సుమారు 5లక్షలకు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా CM పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తి చేశారు. అటు సభకు వచ్చే ప్రజలు, నాయకుల వాహనాల పార్కింగ్‌కు అధికారులు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, సీపీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News August 14, 2024

విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

image

ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖలో అభివృద్ధి పనుల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలను అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. అటు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

News August 14, 2024

మణుగూరులో గుండెపోటుతో భార్యాభర్తల మృతి

image

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ దంపతులు చావులోనూ ఒకరినొకరు వీడలేదు. భర్త కన్నుమూసిన క్షణాల్లోనే భార్య కూడా విగతజీవిలా మారిన ఘటన మణుగూరులో జరిగింది.
స్థానికుల వివరాలిలా.. సుందరయ్యనగర్‌కు చెందిన కొమ్ము సోమయ్య పొలంలో పనిచేస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలిసి అతని భార్య వెంకటమ్మ కూడా గుండెపోటుతో కుప్పకూలింది. భార్యభర్తల మృతితో మణుగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 14, 2024

ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ఎప్పుడు.. ?: PDSU

image

ఖమ్మం జిల్లా లక్షలాదిమంది విద్యార్థుల ఆకాంక్ష ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు ఎప్పుడు అని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వైరాలో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైరాలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

News August 14, 2024

రేపటి సీఎం రైతు సదస్సుకు ప్రజలు తరలి రావాలి: పొంగులేటి

image

రేపు వైరాలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి రైతు సదస్సుకు ప్రజలు తరలిరావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెండు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రేపు రుణమాఫీ చేయడం జరుగుతుందని అట్టి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చి సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని పేర్కొన్నారు.

News August 14, 2024

సీతారామ ప్రాజెక్టు KCR ఆలోచనతోనే పుట్టింది: ఎమ్మెల్సీ మధుసూదన్

image

సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ ఆలోచనలతోనే పుట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో మంత్రి తుమ్మల నిజాయితీగా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తే తాము పూర్తి చేసినట్లు జిల్లా మంత్రులు చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు.

News August 14, 2024

రేపు ఖమ్మం జిల్లాలో సీఎం షెడ్యూల్ ఇదే..!

image

ఖమ్మం జిల్లాలో గురువారం CM రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఉ.11:45 గంటలకు HYD నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మ.12:50కు ములకలపల్లి(M) పూసుగూడెం చేరుకుంటారు. అనంతరం సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడి నుంచి మ.3 గంటలకు వైరా చేరుకొని రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

News August 14, 2024

రెండోసారి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్

image

రేపు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. సీఎంగా భద్యతలు చేపట్టిన తరువాత రెండోసారి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. గత మార్చి11న భద్రాచలంలో జరిగిన సభకు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. రేపటి పర్యటనలో భాగంగా మూడో దఫా రూ. 2లక్షల రుణమాఫీని ప్రారంభించనున్నారు.

News August 14, 2024

పొలం చూసేందుకు వెళ్లి.. గుండెపోటుతో రైతు మృతి

image

పెనుబల్లి మండలం వీఎం బంజర్ సోమ్లానాయక్ తండాకు చెందిన రైతు తేజావత్ రాంబాబు (40) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఉదయం పొలం చూడటానికి వెళ్లి ఆకస్మికంగా కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 14, 2024

పాప పుట్టిందని పెళ్లికి నిరాకరించిన యువకుడు

image

మహిళతో సహజీవనం చేసి పాప పుట్టాక పెళ్లికి నిరాకరించిన ఓ యువకుడిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. చుంచుపల్లి మండలం బాదావత్ తండాకు చెందిన పవన్ పెళ్లి అయి భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ పాపకు జన్మనివ్వడంతో పెళ్లి చేసుకోమని పవన్ పై ఒత్తిడి తెచ్చింది. అతడు నిరాకరించడంతో బాధితురాలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించగా వారు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.