Khammam

News August 14, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూనియర్ డాక్టర్ల సమ్మె
*పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
*ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
*అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
*భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన
*మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
*భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News August 14, 2024

ఖమ్మంలో భట్టి, భద్రాద్రికి తుమ్మల, వరంగల్‌‌లో పొంగులేటి

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసేవారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. అటు వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

News August 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల
☆ విష జ్వరంతో 8 ఏళ్ల బాలుడు మృతి
☆ CM రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్
☆ పాలేరు ప్రభుత్వ బడులపై మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
☆ హరీష్ రావుకు మంత్రి పొంగులేటి వార్నింగ్
☆ భద్రాచలంలో అప్పుడే పుట్టిన శిశువును రాళ్లపై పడేసిన వ్యక్తులు
☆ తాను అభిమానించే నాయకుడు YSR: మంత్రి తుమ్మల
☆ ములకలపల్లిలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి

News August 13, 2024

భద్రాచలంలో అమానుష ఘటన

image

భద్రాచలం పట్టణంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు కవర్లో చుట్టి స్థానిక బ్రిడ్జి కింద ఉన్న రాళ్లగుట్టపై పడేసి వెళ్లిపోయారు. శిశువు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శిశువు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 13, 2024

ఖమ్మం: విష జ్వరంతో 8 ఏళ్ల బాలుడు మృతి

image

విష జ్వరంతో 8 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం రఘునాథపాలెంలో చోటు చేసుకుంది. పంగిడికి చెందిన భూక్యా అంబర్ లాల్- కస్తూరిల ఏకైక కుమారుడు జస్వంత్ (8)కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి నిన్న తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జస్వంత్ ఉదయం సమయంలో ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచిన ఏకైక కుమారుడు ఆకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.

News August 13, 2024

‘పాలేరు ప్రభుత్వ బడులపై మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం’

image

పాలేరులోని ప్రభుత్వ బడులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల నుంచి అప్పర్ ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు PSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేస్తానన్నారు. ప్రతి పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ తో పాటు దీనస్థితిలో ఉన్న విద్యార్థులకు ఆరోగ్యపరమైన ఖర్చులను భరిస్తామని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు.

News August 13, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి ధర.. స్థిరంగా ఉన్న పత్తి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు.

News August 13, 2024

KMM: కుక్క స్నానానికి వేడినీళ్లు పెడుతూ వ్యక్తి మృతి

image

ఖమ్మంలో చంకలో హీటర్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ స్విచ్ ఆన్ చేసిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. పెంపుడు కుక్కకు వేడినీళ్లుతో స్నానం చేయించేందుకు వాటర్ హీటర్ ఆన్ చేసిన మహేశ్ ఫోన్ మాట్లాడుతూ చంకలో హీటర్ పెట్టుకున్నాడు. షాక్ కొట్టి అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య దుర్గాదేవి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.

News August 13, 2024

మణుగూరు: ఆమె చనిపోయి.. మరొకరికి ఆయుష్షు

image

మణుగూరులోని శివాజీనగర్‌కు చెందిన ఏలేంద్ర (53)కు నాలుగు నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కోమాలోకి వెళ్లిన ఆమెను వివిధ ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం రాలేదు. బ్రెయిన్ డెడ్ అయినందున అవయవాలు దానం చేయాలని జీవన్దాన్ ప్రతినిధులు సూచించారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ఏలేంద్ర కళ్లు, లివర్, గుండె, కిడ్నీలు సేకరించారు.

News August 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
>అశ్వరావుపేట నియోజకవర్గం లో ఎమ్మెల్యే జారే పర్యటన
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
>సీఎం సభ ఏర్పాట్లపై వైరా ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
>పాల్వంచ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన