Khammam

News August 12, 2024

KTDM: మృతదేహం ఆమెదేనా!

image

 గొల్లగూడెం గోదారి రేవు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చి చెట్టుకు వేలాడుతోందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాగా ఇటీవల బూర్గంపాడు(M) సారపాక మేడే కాలనీకి చెందిన శైలజ(20) గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటివరకు ఆమె మృతదేహం లభ్యం కాలేదు. ఈ మృతదేహం ఆమెదా ? కాదా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 12, 2024

సీజనల్ వ్యాధుల వేళ ఆర్ఎంపీల దందా

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీనిని క్యాష్ చేసుకొని కొందరు RMPలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ఒప్పందాలు కుదుర్చుకొని, పేదలను దోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. RMPతో కలిసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే చికిత్స చిన్నదైనా భయం పెట్టి అడ్మిట్ చేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.5 వేలు అయ్యే బిల్లును రూ.10 వేలు చేస్తున్నారని పేర్కొన్నారు.

News August 12, 2024

ఖిల్లా, బౌద్ధారామం అభివృద్ధికి ప్రతిపాదనలు

image

అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా కృషిచేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వవైభవం వచ్చేలా పనులు చేపడుతామని తెలిపారు. విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు రోప్ వే, వ్యూ పాయింట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అంతేకాక నేలకొండపల్లి మండలంలోని బౌద్ధారామం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్షేత్రం సుందరీకరణకు కృషి జరుగుతోందని అన్నారు.

News August 12, 2024

రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

image

రెండు లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

News August 12, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభం.. పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సెలవు అనంతరం సోమవారం తిరిగి ప్రారంభమైంది. అయితే ఈరోజు మిర్చి మార్కెట్లో క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,600 ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గతవారం (శుక్రవారం) కంటే ఈరోజు 100 రూపాయలు పెరిగినట్లు మార్కెట్ వ్యాపారస్థులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మార్కెట్‌కు సరుకులు తీసుకువచ్చే రైతులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News August 12, 2024

ఖమ్మం: ఫోన్ మాట్లాడుతూ హీటర్ ఆన్ చేశాడు..

image

ఫోన్ మాట్లాడుతూ చంకలో హీటర్ పెట్టుకుని స్విచ్ ఆన్ చేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. దీంతో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాలిలా.. కాల్వొడ్డులో మహేశ్ (40)ది కొబ్బరికాయల వ్యాపారం. ఆదివారం ఉదయం ఫోన్ మాట్లాడుతూ వాటర్ హీటర్ ఆన్ చేశాడు. హీటర్ అతని చంకలో ఉంది. దీంతో కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయాడు. ఈ ఘటనపై త్రీటౌన్ సీఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి జూపల్లి తుమ్మల పర్యటన
* భద్రాద్రి జిల్లాలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన
* ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
* అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
*మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News August 12, 2024

ఖమ్మం జిల్లాలో టూరిజానికి ఊపు

image

ఖమ్మం జిల్లాలో టూరిజం ఊపందుకోనుంది. కనకగిర అడువుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. పులిగుండాల ప్రాజెక్టులో పర్యాటకులకు బోటింగ్ సదుపాయం, అక్కడకు చేరుకునేలా ట్రెక్కింగ్ అందుబాటులో రానుంది. ఆపై వాచ్ టవర్, పక్షులను వీక్షించేందుకు ఏర్పాట్లు, సఫారీపై విహారయాత్ర అవకాశం కల్పిస్తారు. కాటేజీల నిర్మాణంతో పర్యాటకులు ఇక్కడే విడిది చేసే అవకాశం లభిస్తుంది.

News August 12, 2024

ప్రజావాణి రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మద్యపాన నిషేధ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటన సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని సూచించారు.

News August 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

∆}విద్యాశాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
∆}వైరా: విద్యుత్ ఘాతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
∆}సీతారామ పంప్ హౌస్ ట్రయిల్ రన్-2 ప్రారంభించిన మంత్రులు
∆}గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదు: మంత్రి తుమ్మల
∆} శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి
∆}కొత్తగూడెం: హెచ్ఎంకు నోటీసులు. డిప్యూటీ వార్డెన్ సస్పెండ్
∆}ఇల్లందు: గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్