India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.
* 1st ఇయర్: 17,467 మంది
* 2nd ఇయర్: 17,221మంది
* పరీక్షా కేంద్రాలు: 66
* ఇన్విజిలేటర్లు: 816
* 3ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 3 సిట్టింగ్ స్క్వాడ్‌లు
* 17 కస్టోడియన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

యాదాద్రి (D) భూదాన్ పోచంపల్లి ధోతిగూడెం శివారులోని ఓ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కూసుమంచి గట్టుసింగారానికి చెందిన ధార పవన్ మృతి చెందారు. భోజన విరామ సమయంలో కార్మికులంతా బయటకు వెళ్లగా, విధుల్లో ఉన్న పవన్ వద్ద ట్రోలిన్ పేలింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సీనియర్ కెమిస్ట్రీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మిత్రుడి దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా ఎండపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బర్రె వంశీ మృతి చెందారు. పెనుబల్లి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి డిపోలో పనిచేస్తున్న వంశీకి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. స్నేహితుడిని కడసారి చూసేందుకు వచ్చి, తానూ విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

ఖమ్మం జిల్లాలో డాక్టర్ రిఫరెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని వాడుతున్న మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏడాదిలో 50 వేల కిట్స్ అమ్ముడయ్యాయి. షెడ్యూల్-H కిందకి వచ్చే మీసో ప్రోస్టల్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దు. ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని DI అనిల్ తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగులకు అందించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఈ నెల 22న ముగియనుందని డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణ కోసం మార్చి 1న ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Sorry, no posts matched your criteria.