Khammam

News August 11, 2024

KTDM: ట్రాక్టర్ – బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

image

అశ్వారావుపేట మండలం వినాయకపురం పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ – ద్విచక్ర వాహనం ఆదివారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చాతిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో బాడీ నుజ్జునుజ్జైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

KTDM: ట్రాక్టర్ – బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

image

అశ్వారావుపేట మండలం వినాయకపురం పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ – ద్విచక్ర వాహనం ఆదివారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చాతిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో బాడీ నుజ్జునుజ్జైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

KTDM: భద్రతా బలగాలకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. తుమ్నార్ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్లు భద్రత సిబ్బంది పేర్కొన్నారు.

News August 11, 2024

సీఎం పర్యటన.. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ ఏర్పాట్ల పరిశీలన

image

వైరాలో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆదివారం మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తదనంతరం అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు.

News August 11, 2024

కొత్తగూడెం: హెచ్ఎంకు నోటీసులు.. డిప్యూటీ వార్డెన్ సస్పెండ్

image

కొత్తపల్లి ఆశ్రమ గిరిజన పాఠశాలలో 8వ తరగతి దీపక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, విద్యార్థి మృతికి కారకులైన పాఠశాల హెచ్ఎంకు నోటీసులు, డిప్యూటీ వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెచ్ఎంకు నోటీసులు, డిప్యూటీ వార్డెన్ హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News August 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు రాష్ట్ర మంత్రుల పర్యటన

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, పొంగులేటి, జూపల్లి పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు అయినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని, అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శిస్తారని అన్నారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, ఆ వెంటనే కిన్నెరసాని ప్రాజెక్టులో బోటింగ్ చేస్తారని పేర్కొన్నారు.

News August 11, 2024

భద్రాచలంలో 150 కిలోల గంజాయి పట్టివేత

image

చింతూరు సరిహద్దు ప్రాంతం నుంచి ట్రాక్టర్ ట్రక్కులో భారీగా తరలిస్తున్న ఎండు గంజాయిని భద్రాచలంలో ఆబ్కారీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో వెళ్తున్న ట్రాక్టర్‌ను భద్రాచలం శివారు ప్రాంతం నుంచి వెంబడించారు. స్థానిక బ్రిడ్జి వద్దకు రాగానే ట్రాక్టర్ వదిలి డ్రైవరు పరారయ్యాడు. వాహనం కింద ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగంలో సుమారు 150 కిలోలకు పైగా గంజాయి పొట్లాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

News August 11, 2024

ఘనంగా రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News August 11, 2024

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

image

వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. పచ్చని చెట్లు ఎత్తయిన రెండు కొండల మధ్య మంచి రాళ్ల మీదుగా ఎగిసి పడుతున్న జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం బొగత సందర్శనకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

News August 11, 2024

ఇల్లెందు: టీవీ చూడొద్దన్నందుకు.. పురుగు మందు తాగాడు

image

తండ్రి టీవీ చూడొద్దన్నందుకు మనస్తాపంతో ఓ బాలుడు పురుగు మందు తాగిన ఘటన ఇల్లెందు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అమర్సింగ్ తండాకు చెందిన గుగులోత్ సాయికుమార్(15 ) ఈనెల 7న ఇంట్లో అర్ధరాత్రి టీవీ చూస్తుండగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.