Khammam

News August 10, 2024

దారుణం.. దోమల మందుతాగి మహిళ మృతి

image

కొత్తగూడెంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు బత్తుల ఓదమ్మ దోమల మందు తాగి మృతి చెందింది. ఆమె నిన్న మంచినీళ్లు అనుకుని వాటర్ బాటిల్‌లోఉన్న దోమల మందును తాగింది. ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

News August 10, 2024

HYD జూబ్లీహిల్స్‌లో వ్యభిచార గృహంపై దాడి

image

HYD జూబ్లీహిల్స్‌లోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకుడు చంద్రశేఖర్, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. స్రవంతి నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. విటులు ఖమ్మంకి చెందిన నాగేశ్వరరావు, షేక్ సైదులు, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎర్ర రాజుగా గుర్తించారు.

News August 10, 2024

చింతకాని: కరెంటు షాక్‌కు గురై యువకుడు మృతి

image

కరెంటు షాక్‌కు గురై ఓ యువకుుడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చింతకాని మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నామవరంకి చెందిన బొలికొండ బాను(28) ఈనెల 2 కరెంటు షాక్ గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

News August 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు
> ఖమ్మం నగరంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
> చండ్రుగొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
>జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

News August 10, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. నేడు, రేపు వారాంతం కావడంతో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. కావున జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.

News August 10, 2024

‘పాలేరు నుండి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేయాలి’

image

పాలేరు నుండి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధిపై పర్యాటకశాఖ మంత్రి జూపల్లికి మంత్రి తుమ్మల ప్రతిపాదనలు చేశారు. ఫీల్డ్ విజిట్ చేయాలని జూపల్లిని మంత్రి తుమ్మల ఆహ్వానించారు. ఈ నెల 12న జిల్లాలో జూపల్లి పర్యటన ఉన్న నేపథ్యంలో తుమ్మల మాట్లాడారు. పాలేరు రిజర్వాయర్ అభివృద్ధి, కూసుమంచి శివాలయం, నేలకొండపల్లి బౌద్దస్తూపం, ఖమ్మం ఖిల్లాపై రోప్ వే, భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు.

News August 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

* వైరాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినడిప్యూటీ సీఎం
*ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
*ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ: డిప్యూటీ సీఎం భట్టి
*మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
* సన్నవడ్లుకు 500 రూపాయలు బోనస్: మంత్రి తుమ్మల

News August 9, 2024

సుంకిశాల ఘటనపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు

image

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సుంకిశాల ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై BRS ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేయిస్తామని వైరా స్నానాల లక్ష్మీపురంలో జరిగిన సమావేశంలో చెప్పారు.

News August 9, 2024

ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ: డిప్యూటీ సీఎం భట్టి

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రుణమాఫీ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రైతుల ప్రభుత్వమని అందరికి రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

News August 9, 2024

ఖమ్మం: స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?

image

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. గడువు ముగిసిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు SC, ST, BC రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,070 గ్రామపంచాయతీలు ఉన్నాయి.