Khammam

News July 23, 2024

ఖమ్మం: 25 ఎకరాల భూమి కేటాయింపు: డిప్యూటీ సీఎం

image

ఖమ్మం జిల్లాలో ప్రతి 10 గ్రామాలకు ఓ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా తయారు చేస్తామని చెప్పారు. దివ్యాంగుల రిజర్వేషన్‌పై చేసిన స్మిత సబర్వాల్ ట్వీట్ ఆమె వ్యక్తిగతమని అన్నారు. ఆమె ట్వీట్‌కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

News July 23, 2024

ఖమ్మం: జ్వరంతో LKG బాలుడు మృతి

image

తిరుమలాయపాలెం గ్రామంలో జ్వరం వచ్చి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామస్థుడు గొలుసు ఉమేశ్ కొడుకు అక్షిత్(6) LKG చదువుతున్నాడు. సోమవారం ఉదయం దాకా ఆడుకున్న బాలుడికి ఒక్కసారిగా జ్వరం సోకింది. ఫిట్స్ కూడా రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగా.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News July 23, 2024

బస్ బుకింగ్‌పై 10% డిస్కౌంట్: RMKMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న అన్ని డిపోల నుంచి వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు బస్ బుకింగ్ చేస్తున్న వారికి 10% రాయితీ వర్తిస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ అన్నారు. ప్రయాణాలను TGSRTCతో మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసుకోగలరని కోరారు.

News July 23, 2024

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

ఖమ్మం జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గడచిన రెండు వారాలుగా జిల్లాలో 16 చొప్పున డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 9,491 శాంపిళ్లు సేకరించగా ఈనెల 19వ తేదీ వరకు 210 డెంగీ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో తిరుమలాయపాలెం పీహెచ్సీ పరిధిలోనే 18 కేసులు ఉంటే.. జల్లేపల్లిలోనే 14 కేసులు నమోదు కావటం గమనార్హం.

News July 23, 2024

ఖమ్మం, రాజమండ్రి వెళ్లే బస్సుల దారి మళ్ళింపు: DMBCM

image

గోదావరి వరద నీరు సారపాక – రెడ్డిపాలెం మధ్యలో రోడ్డుమీద ప్రవహిస్తున్న కారణంగా భద్రాచలం నుంచి బూర్గంపాడు వెళ్లే రాక పోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే బస్సులన్నీ వయా BPL, ఎంపీ బంజార మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సులు బూర్గంపాడుకు బదులుగా పాల్వంచ, దమ్మపేట మీదుగా అశ్వారావుపేటకు నడుపుతున్నట్లు భద్రాచలం డిపో మేనేజర్ తిరుపతి తెలిపారు.

News July 23, 2024

పథకాలకు నిధుల కోసం జిల్లావాసుల నిరీక్షణ

image

ఖమ్మం జిల్లాలోని పడకేసిన అభివృద్ధి పనులు, నిలిచిపోయిన నిర్మాణాలు, సంక్షేమ పథకాల కోసం అర్హుల ఎదురుచూపులకు బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రకటించిన పథకాల అమలుకు నిధులు కేటాయిస్తారని భావిస్తుండగా.. జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి.

News July 23, 2024

సామాన్యులకు దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంట పుట్టిస్తున్న కూరగాయల ధరలు చూసి సామాన్యుల ఇళ్లల్లో నిత్యం వంట చేసుకోవడం ఓ తంటగా మారింది. రూ.250లకు వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. అలాంటిది ప్రస్తుతం రూ.600 ఖర్చు చేసినా వారం రోజులు సరిపడా కూరలు లభించడం లేదని జనాలు వాపోతున్నారు. ప్రతిరోజు ఆహారంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల ధరలు ఆకాశన్నంటుతుండడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

News July 23, 2024

భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి 12,58,826 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 50 అడుగులకు పైనే ఉండగా, మరో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53 అడుగులకు నేడు చేరువయ్యే ఆస్కారముందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతా వాసులను అప్రమత్తం చేస్తున్నారు.

News July 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరిపిచ్చిన వానలు
> వరదలకు మూడో ప్రమాద హెచ్చరిక దిశగా పెరుగుతున్న గోదావరి
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు
> ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
> భద్రాద్రి జిల్లాకు రానున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు

News July 23, 2024

లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలి: జిల్లా కలెక్టర్

image

లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రంలో గ్రూప్-1 ఉద్యోగార్థుల శిక్షణా తరగతుల తీరును పరిశీలించారు. పోటీ పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎప్పుడు శ్రమపై దృష్టి పెట్టాలని, కచ్చితంగా ఫలితం వస్తుందన్నారు.