Khammam

News January 22, 2026

ఖమ్మం: ఎన్నికల నగారా.. మున్సిపాలిటీలపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్!

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లిలలో ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల తనిఖీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.

News January 21, 2026

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: ఈసీ

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర EC కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ మినహా 5 మున్సిపాలిటీల్లో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

News January 21, 2026

ఖమ్మం: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

image

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బోటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరాం(45)అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ ఏకగ్రీవంగా బోటితండా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. తులసీరామ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News January 21, 2026

ఖమ్మం ఆర్టీసీకి రూ.19.80 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి సందర్భంగా ఖమ్మం రీజియన్‌లో రికార్డు స్థాయిలో రూ.19.80 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 19 వరకు ఏడు డిపోల పరిధిలో 1,483 అదనపు సర్వీసులను నడిపామని తెలిపారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా చేరవేశామని, అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆర్టీసీ యంత్రాంగం పేర్కొంది.

News January 21, 2026

జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 30 జంక్షన్ల వద్ద పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి జంక్షన్‌ వద్ద ప్రత్యేక నిఘా, మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.

News January 21, 2026

ఖమ్మం: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వసతి సౌకర్యంతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 20, 2026

‘ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వేకు సిద్ధం కావాలి’

image

రాష్ట్రంలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లను కేటాయించి, రెండో గెజిట్ నోటిఫికేషన్ తర్వాత శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని సూచించారు. భూభారతి కింద చేపట్టే ఈసర్వేకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

News January 20, 2026

ఖమ్మం: ఇంటర్ పరీక్షలకు సిద్ధం.. 66 కేంద్రాల ఏర్పాటు

image

ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 35,188 మంది విద్యార్థుల కోసం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించి, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు DIEO రవిబాబు తెలిపారు.