Khammam

News July 22, 2024

కొత్తగూడెం: 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

image

ఆరు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సుమారు 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మొత్తం 11 ఏరియాల్లో రోజుకు 2 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1.10 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో ఆరు రోజుల్లో సుమారు 5 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీల్లో ఆరు రోజులు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబికి అంతరాయం వాటిల్లింది.

News July 22, 2024

రైతు రుణమాఫీ కాని రైతులకు ముఖ్య గమనిక

image

రైతు రుణమాఫీ కానీ రైతుల కోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారుల నెంబర్లను జిల్లా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఖమ్మం జిల్లా అధికారి వినయ్ కుమార్ (ఏవో) 7288894281, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి (ఏవో) 7288894262 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులు సూచించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి.. సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News July 21, 2024

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకుంది. ఎగువనున్న ప్రాజెక్టులో నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో గోదావరి నీటిమట్టం గంటకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. మరో నాలుగు అడుగులు నీటిమట్టం పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

మధిర: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఖమ్మం-బోనకల్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథపురం వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆటోలు ఆరుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

News July 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక

image

విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. తడిసిన కరెంట్ స్థంబాలను, విద్యుత్ లైన్‌కు తగిలే చెట్లను, తడి చేతులతో చార్జింగ్ పెట్టడం, స్విచ్ ఆన్ చేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. అలాగే ఉతికిన బట్టలు ఇనుప తీగలపై ఆరవేయొద్దని సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకుండా, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 21, 2024

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

image

పినపాక మండలం పోట్లపల్లికి చెందిన బడే నాగరాజు, పాయం నగేష్ ఇద్దరు కలిసి చేపలు పట్టేందుకు పొట్లపల్లి వాగు చెక్ డాం వద్దకు వెళ్లారు. చెక్ డ్యాంలోకి దిగి చేపలు పడుతుండగా వరద ప్రవాహం అధికం కావడంతో పాయం నగేష్ వరదలో కొట్టుకొని పోయాడు. బడే నాగరాజు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజేందర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News July 21, 2024

ఈనెల 22 నుంచి 29 వరకు పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమం

image

ఈనెల 22 నుంచి 29 వరకు పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి తెలిపారు. తొలిరోజు సోమవారం బోధనోపకరణాల దినోత్సవం, రెండో రోజు గణిత దినోత్సవం, మూడోరోజు క్రీడా దినోత్సవం, నాలుగో రోజు సాంస్కృతిక దినోత్సవం, ఐదో రోజు నైపుణ్యాభివృద్ధి, ఆరో రోజు పర్యావరణ క్లబ్స్ చివరి రోజు కమ్యూనిటీ ఇన్వాల్వ్ మెంట్ డే నిర్వహించాలని తెలిపారు.

News July 21, 2024

మువ్వాను కలిసిన సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి

image

HYDలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మువ్వ విజయ్ బాబును సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News July 21, 2024

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

image

ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 37 అడుగుల వద్ద నీటిమట్టం ఉదయం 10 గంటలకు 38 అడుగులు చేరుకుంది. మరో 6 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

కార్పొరేషన్ ఛైర్మన్ ‌గా బాధ్యతలు స్వీకరించిన మువ్వ

image

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మువ్వ విజయబాబు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మువ్వ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.