Khammam

News July 8, 2024

పాల్వంచలో టిఫిన్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

image

టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా
ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మీనారాయణ ఆదివారం ఇంట్లో టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలాడు. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.

News July 8, 2024

‘స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రి లేని అనాథ ముస్లిం విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 కల్లా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్ను సంప్రదించాలన్నారు.

News July 8, 2024

ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా పత్తి సాగు

image

ఈ ఏడాది పత్తి సాగు లక్ష్యానికి
దూరంగా ఉంది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. వరి 2.83 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, పత్తి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది పత్తి సాగు అంచనాను 2,01,834 ఎకరాలకు తగ్గించారు. అయినా ఆ లక్ష్యం మేరకు కూడా నెరవేరడం ప్రశ్నార్థకంగానే మారింది. శనివారం నాటికి 1,81,794 ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

News July 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
✓ ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం పర్యటన
✓ సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎంYSR జయంతి
✓ పలు శాఖల పై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన

News July 8, 2024

ఖమ్మం: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తండ్రీకొడుకులు క్వాలిఫై

image

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌‌లో తండ్రీకొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనయుడు ఇమ్మానియేలు (25) డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవికిరణ్‌ తనయుడికి సూచనలు ఇవ్వడంతోపాటు తానూ పరీక్ష రాశారు. రిజర్వేషన్, ఇన్‌ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో పరీక్ష రాయగలిగినట్టు వివరించారు.

News July 8, 2024

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన మంత్రి తుమ్మల

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల వెంట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

News July 7, 2024

గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన తండ్రి, కొడుకులు

image

ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవి కిరణ్, ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానుయేల్ ఇద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. రవి కిరణ్ కామేపల్లిలోని ఎంజేపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.

News July 7, 2024

ఖమ్మం: రైతు భరోసా.. మెజార్టీ రైతుల అభిప్రాయమిదే..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసాను ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని జిల్లాలోని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. ఒక రైతుకు అంతకుమించి భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని, రియల్ఎస్టేట్ వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

News July 7, 2024

ఖమ్మంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం

image

నిద్రమాత్రలు మింగి జిల్లా టీఎన్జీవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అబ్దుల్ హాసన్ తన ఇంట్లో భారీ మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్టైన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

News July 7, 2024

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చేసిన ప్రజల నుంచి డిప్యూటీ సీఎం దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.