Mahbubnagar

News April 6, 2025

మహబూబ్‌నగర్: శ్రీరాముని పాదం చూశారా?

image

MBNR జిల్లా కోయిలకొండలోని మహిమాన్విత క్షేత్రమైన శ్రీరామకొండ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదం స్వయంభుగా వెలసిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ తన పాదం మోపి సేదతీరినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే సమయంలో ఇక్కడ ఒక మూలికపడి కొండ మొత్తం వనమూలికలకు ప్రసిద్ధగా మారిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉండడం విశేషం. 

News April 6, 2025

మహబూబ్‌నగర్: నేడు శ్రీరామకొండకు వెళ్తున్నారా..?

image

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీసీతారాముల పల్లకీ సేవ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు. 

News April 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు GOOD NEWS

image

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారి నెంబర్-167 ప్రధాన రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొత్తం రూ.706.08 కోట్ల వ్యయంతో 108 కిలోమీటర్ల రహదారిని మహబూబ్‌నగర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్నారు.

News April 6, 2025

మహబూబ్‌నగర్‌లో నేడు చికెన్, మటన్ షాపులు బంద్

image

శ్రీరామ నవమిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం చికెన్, మటన్, చేపలు తదితర మాంసం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మున్సిపాలిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. SHARE IT

News April 6, 2025

మహబూబ్‌నగర్: ‘మా పోరాటం ఆగదు’

image

రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం మహబూబ్‌నగర్‌లో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన చట్టబద్ధ హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అధికార మదంతో మతపిచ్చి పట్టి మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు.  

News April 6, 2025

చిన్నచింతకుంట: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే

image

చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బోయ బుజ్జమ్మ నివాసంలో అదే సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని స్థానిక నాయకులు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 5, 2025

పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.

News April 5, 2025

MBNR: PU నివేదిక ఇవ్వండి: CM 

image

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాల‌ని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ జి.ఎన్‌.శ్రీ‌నివాస్‌ పాల్గొన్నారు. అవ‌స‌ర‌మైన నిధుల, భ‌వ‌నాల నియామ‌కాలపై నివేదిక ఇవ్వాలన్నారు.

News April 5, 2025

MBNR: ప్రేమించాడని యువకుడిపై దాడి

image

నవాబుపేట మండలంలో యువతిని ప్రేమించాడని యువకుడిపై దాడి జరిగిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పల్లెగడ్డకు చెందిన అరవింద్ పాత పాలమూర్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు అరవింద్‌ను మాట్లాడుదామని గ్రామం బయటికి తీసుకెళ్లి దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News April 5, 2025

మహబూబ్‌నగర్: BJP నాయకులపై కేసు నమోదు

image

పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించిన BJP నాయకులపై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం MBNR జిల్లా చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. ఉన్నత పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో BJP నాయకులు రమేశ్, శివ మరికొందరు కార్యకర్తలు HM అనుమతి లేకుండా పాఠశాలను విడిపించి విద్యార్థులను తీసుకొని CM దిష్టిబొమ్మ దహనం చేశారని HM మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.