Mahbubnagar

News March 17, 2026

పాలమూరు: రైతులు ALERT.. అప్లై చేసుకోండి

image

‘రైతు భరోసా’ కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం రైతులు ఈనెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆధార్, పట్టాదార్ పాస్ బుక్ (28/02/2026 వరకు వచ్చిన కొత్త పట్టా), బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT

News March 17, 2026

MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

image

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.

News March 17, 2026

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.

News March 17, 2026

పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

image

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?

News March 17, 2026

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News March 16, 2026

పాలమూరు: SZ.. రేపు KHO-KHO ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్‌తో హాజరు కావాలన్నారు. SHARE IT

News March 16, 2026

MBNR: పీయూలో KHO-KHO సెలక్షన్స్

image

సౌత్ జోన్‌లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ KHO-KHO స్త్రీల విభాగంలో ఎంపికలను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జిఎన్.శ్రీనివాస్, రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు హాజరై మాట్లాడారు. మంచి ప్రదర్శన కనబరిచి యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీడీ డా.వై.శ్రీనివాసులు, ఖో-ఖో ప్రొఫెసర్ సత్య భాస్కర్ రెడ్డి, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

News March 15, 2026

బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

image

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.

News March 15, 2026

MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

image

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News March 14, 2026

సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.