Mahbubnagar

News March 19, 2026

MBNR: ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

image

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.

News March 19, 2026

MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

image

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.

News March 19, 2026

MBNR: ఉగాది సుఖ సంతోషాలు నింపాలి: SP

image

తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జానకి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు.

News March 18, 2026

మహబూబ్‌నగర్: ‘వేసవిలో నీటి సమస్య తలెత్తకూడదు’

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి రాకుండా చూడాలని మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మూడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 60 డివిజన్లలో ఎప్పటికప్పుడు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News March 18, 2026

మన్యంకొండలో వసంత నవరాత్రులు

image

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 28 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, 28న శ్రీరామ నవమి వేడుకలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 29న శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.

News March 18, 2026

MBNR : ఉడిత్యాలలో 36.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బాలానగర్ 30.8, నవాబుపేట మండలం కొల్లూరు 26.3, మిడ్జిల్ 21.5, నవాబుపేట 15.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 12.5, మహబూబ్ నగర్ అర్బన్ 11.7, జడ్చర్ల 10.3, మహమ్మదాబాద్ 9.3, గండేడ్ మండలం సల్కర్ పేట 5.5, దేవరకద్ర 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News March 18, 2026

MBNR: LPG సిలిండర్ల సరఫరాపై కంట్రోల్ రూమ్

image

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటల్స్‌లో డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ నిల్వలపై కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ రెడ్డి 9666052780, అబ్దుల్ జలీల్ 9912659005లను సంప్రదించాలన్నారు.

News March 18, 2026

MBNR: సిలిండర్ల అక్రమ నిల్వలపై నిఘా.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడినా, నిల్వ ఉంచినా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

News March 18, 2026

MBNR: ‘తొలిసారిగా డిజిటల్‌లో జనాభా గణన’

image

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.

News March 18, 2026

MBNR: జన గణన.. దశలవారీగా ఇలా!

image

✒మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని,
✒రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుందని,మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.