Mahbubnagar

News March 25, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.

News March 23, 2026

పాలమూరు: రైతులు ALERT.. 2 రోజులే ఛాన్స్.!

image

‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని, అప్లికేషన్ ఫామ్‌తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలన్నారు. SHARE IT.

News March 22, 2026

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

News March 21, 2026

పాలమూరు:GET READY.. నేడే రంజాన్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్- ఫితార్) మాసం నేపథ్యంలో సామూహిక ప్రార్థనల (నమాజ్) కోసం ఈద్గా, మస్జీద్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈద్ నమాజ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు గత నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ప్రతిరోజు ఐదు పూటలా నమాజ్, ప్రత్యేక తరావీ నిర్వహించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో నేడు సందడి నెలకొననుంది.
#ఈద్ ముబారక్

News March 20, 2026

MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.

News March 20, 2026

MBNR: రంజాన్.. బందోబస్తు ఏర్పాట్లపై నిఘా

image

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇద్గా వక్ఫ్-ఎ-రహ్మానియా వద్ద అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్‌కు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు: రేపే..రంజాన్ వేడుకలు!!

image

ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు (ఈద్-ఉల్-ఫితర్) ఈనెల 21న జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని సూచించారు. రంజాన్ మాసం నేటితో (మార్చి 20) ముగియనుందని చెప్పారు. ముస్లిం సోదరులు (నమాజ్) ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.

News March 19, 2026

MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి

image

మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా శాసనసభలో నియమిస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో మరింత కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు. MLA కొంతకాలంగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నారు. పనితీరును గుర్తించి ప్రభుత్వం విఫ్‌గా నియమించింది.